Featured

Charminar History : చార్మినార్ ను కట్టడం వెనుక కారణం ఏమిటి… హైదరాబాద్ నగరం ఎవరి కోసం కట్టారు…!

Charminar History : ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాద్ కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన నగరం. నావభ్యుల కాలంలో నిర్మించిన ఈ నగరంలో అటు ముస్లిం రాజుల అభిరుచికి అనుగుణంగా ఉన్న కట్టడాలు అలాగే కాకతీయుల కళా వైభవం రెండూ సమ్మిలితమై కనిపిస్తుంది. అలాంటి హైదరాబాద్ నగరంను తలుచుకోగానే గుర్తొచ్చే కట్టడం చార్మినార్. చార్ అంటే నాలుగు, మినార్ అనగా స్థంబం అంటే నాలుగు స్థంబాలు కలిగిన నిర్మాణం. అలాంటి చార్మినార్ ను నిర్మించింది ఎవరు ఎందుకు నిర్మించారు. ఇప్పటికీ చెక్కుచెదరని చార్మినార్ విశేషాలు తెలుసుకుందాం.

ఆ వ్యాధి చిహ్నంగా చార్మినార్…

కాకతీయులు పరిపాలించిన నాలుగువందల ఏళ్ల తరువాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా రాజుగా గోల్కొండ, అలాగే అక్కడి చుట్టుపక్కన ప్రాంతాలను పరిపాలించారు. ఆ సమయంలో కాకతీయులు నిర్మించిన గోల్కొండ నగరం ప్రస్తుత జనాభా కు సరిపోవడం లేదని కొత్త నగరం నిర్మించాలని అనుకున్నారు. మూసి నదికి దక్షిణ ప్రాంతం విశలంగా అన్ని వసతులతో ప్రజలు జీవించడానికి అనుగుణంగా ఉందని అక్కడ నాగరాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా గోల్కొండ కొత్తగా నిర్మించబోయే నాగరానికి మధ్య మూసి నది మీద వంతెన నిర్మించాలని అనుకుని పురానాపూల్ వంతెన నిర్మించారు. ఆ తరువాత నగర నిర్మాణానికి అనువైన ఆర్చిటెక్ట్ కోసం ప్రపంచం మొత్తం వెతకగా ఇరాన్ దేశపు అర్కిటెక్ట్ మీర్ ముమిన్ ను కలిసి ఆయనను ఆహ్వానించారు. ఇక ఆయన నగర నిర్మాణానికి సంబంధిచిన ప్రణాళికలను రాజుకు వివరించగా ఆయన నైపుణ్యానికి మెచ్చిన రాజు ఆయనను తన మంత్రి గా నియమించారు. అయితే నగర నిర్మాణం మొదలవ్వడానికి ముందే ఇబ్రహీం కూతుబ్ షా మరణించడం తో కొడుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి కోరిక మేరకు నగర నిర్మాణం మొదలు పెట్టారు.

కొత్త నగర నిర్మాణంను ఇరాన్ లోని ఇస్వాహ్న నగరం లాగా నిర్మించాలని అనుకున్నారు. అలా నిర్మించిన నగరానికి తన రాజ్యాన్ని మార్చాడు కులీ కుతుబ్ షా. ఆ తరువాత రాజ్యంలో కలరా వ్యాధి విజృంభించి ఎంతో మంది మరణించడంతో ఆ వ్యాధి తన రాజ్యం నుండి వెళ్ళిపోతే ఇదే నగరంలో మసీదు కడతానని రాజు మొక్కుకున్నాడు. అలానే వ్యాధి తగ్గుముఖం పట్టాక చెప్పినట్లు అక్కడ చార్మినార్ నిర్మాణం మొదలు పెట్టారు. 1591లో చార్మినార్ నిర్మాణం మొదలైంది ఇరాన్ లోని ఇమామ్ రాజు సమాధి లాగానే ఈ నిర్మాణం నాలుగు స్థంబాలతో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 1592 కి చార్మినార్ నిర్మాణం పూర్తయింది. కానీ కొన్ని పుస్తకాల ప్రకారం చార్మినార్ ను 1589 లో ప్రారంభించగా 1592లో పూర్తయింది. ఇక కులీ కుతుబ్ షా తాను ప్రేమించిన హిందూ యువతి పేరును ఈ నగరానికో భాగ్యనగరం గా పెట్టారు. ఆమెను పెళ్లి చేసుకుని ఆమె పేరు హైదర్ మహల్ గా మార్చారు. అలా భాగ్యనగరం ను హైదరాబాద్ గా మార్చారు. ఇలా ఎన్ని తారలు మారినా చార్మినార్ మాత్రం చరిత్ర సాక్ష్యంగా నిలిచింది.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago