Categories: FeaturedGeneral News

World Cup T20 finals : మరోసారి సీన్ రిపీట్… ముప్పై ఏళ్ళ క్రితం జరిగిందే మళ్ళీ జరగనుందా…!

World Cup T20 finals : మొదటి నుండి పేలవమైన పెర్ఫార్మన్స్ తో సెమీస్ ఆశలను వదులుకున్న పాకిస్థాన్ అనూహ్యంగా సెమీస్ చేరింది. ఇక పడుతూ లేస్తూ వచ్చినా కూడా దాదాపు సెమీస్ ఆశలు లేవు, కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ కూడా సెమిస్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఇలానే ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది. 1992లో వరల్డ్ కప్ ప్రత్యర్థులు కూడా ఇంగ్లాండ్, పాకిస్థాన్. అప్పుడు కూడా ఇలాంటి సీన్ రిపీట్ అవ్వడం విశేషం ఇదంతా చూస్తుంటే అదే ఫలితం మళ్ళీ రిపీట్ అవ్వబోతోందా అన్న అనుమానం క్రికెట్ అభిమానులకు కలుగుతోంది.

మళ్ళీ అదే జరగనుందా…

ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న వరల్డ్ కప్ 2022 లో ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. అసలు సెమీస్ కి రాదనుకున్న పాకిస్థాన్ ఫైనల్ లో ఉంది మొదటి నుండి బాగా ఆడిన కివిస్ దారుణంగ్స్ ఓడిపోయి ఇంటికి పోయింది. ఇక పడుతూ లేస్తూ ఇంగ్లాండ్ కూడా ఫైనల్స్ చేరి వీళ్ళిద్దరూ ఇప్పుడు 13 న జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నారు. 1992 లో జరిగిన బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ కప్ లో ఇదే జరిగింది. అప్పటి క్రికెట్ వేదికలు న్యూజిలాండ్, ఇంగ్లాండ్. పాకిస్థాన్ వెస్టిండీస్ తోనూ ఇండియా తోనూ మ్యాచ్లు ఓడిపోయి ఇక ఇంటికి పోతుంది అనే టైములో అనూహ్యంగా మూడు మ్యాచ్ లు గెలిచి సెమీస్ కి వెళ్ళింది. ఇక సెమీస్ లో న్యూజిలాండ్ ను మట్టికరిపించి ఫైనల్స్ కి చేరింది. ఫైనల్ లో ప్రత్యర్థి ఇంగ్లాండ్.

ఇక ఇపుడు వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ మ్యాచ్ల్లో ఇండియా, జింబాబ్వే లతో వరుసగా ఓడిపోయింది. ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్ కు చేరింది. ఇక సెమీస్ లో పాకిస్థాన్ కి అదృష్టం నెథెర్లండ్స్ రూపంలో దొరికింది, నేధర్లండ్స్ కి సౌత్ ఆఫ్రికా కి జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా నేదర్లండ్స్ గెలిచి పాకిస్థాన్ కి ఫైనల్ చేరే అవకాశం ఇచ్చింది. ఇక ఫైనల్ లో ఇంగ్లాండ్ తో పాకిస్థాన్ తలపడనుంది. ఇక 92 మ్యాచ్ లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట్లోనే కీలకమైన రెండు వికెట్స్ కోల్పోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ దే అనుకున్నారు. అయితే అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్, ఇంజిమమ్, జావీద్ మియాందాద్ విలువైన పరుగులు తీసి 50 ఓవర్లలో 249 పరుగులు తీసింది. ఇక ఇంగ్లాండ్ 49.2 ఓవర్లలో 227పరుగుల పరిమితమై 22 పరుగుల తేడాతో ఓడిపోయి పాకిస్తాన్ కు తొలి వరల్డ్ కప్ ను అందించింది. మరోసారి అదే సీన్ రిపీట్ అవుతుందో లేక మారుతోందో చూడాలి మరి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago