Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమంలో తొమ్మిదవ వారం జరిగిన ఎలిమినేషన్ అందరినీ ఓకింత ఆశ్చర్యానికి గురిచేసింది.టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఉన్నఫలంగా 9వ వారం బిగ్ బాస్ నుంచి బయటకు రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విధంగా 9వ వారం గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఆమె కూడా ఎంతో షాక్ అయ్యి తాను బిగ్ బాస్ వదిలి వెళ్ళనని నన్ను పంపించకండి బిగ్ బాస్ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యారు.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గీతూ కూడా బజ్ కార్యక్రమంలో తప్ప ఎక్కడ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు అయితే తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ ఎలిమినేషన్ గల కారణాలను ఈమె చెప్పు చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నుంచి తాను ఎలిమినేట్ కావడానికి కేవలం కొందరే కారణమంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
తాను బిగ్ బాస్ వెళ్లే ముందు కొందరికి తన గురించి పాజిటివ్ గా ప్రమోట్ చేయమని 25 వేల రూపాయలను ఇచ్చాను.వారిపై ఉన్న నమ్మకంతో నేను ధైర్యంగా హౌస్ లోకి అడుగుపెట్టానని అయితే వాళ్ళు డబ్బులు తీసుకుని నా గురించి ఏ మాత్రం ప్రమోషన్ చేయలేదు అని తాజాగా బయటకు వచ్చిన తర్వాత తనకు ఈ విషయం తెలిసిందని ఇలా నమ్మి వారికి డబ్బులు ఇస్తే వాళ్లు మోసం చేశారని గీతూ ఎమోషనల్ అయ్యారు.
ఇలా నమ్మిన వాళ్లే మోసం చేయడం తనని ఎంతగానో బాధ పెట్టిందని, నేను ఆడిన ఆట తీరును తప్పు పడుతున్నారు. గత బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నటువంటి అభిజిత్ కౌశల్ కన్నా నేనేం తక్కువ వాళ్ళు చేస్తే ఒప్పు నేను చేస్తేతప్ప అంటూ ఈమె తన ఎలిమినేషన్ కి గల కారణాలను తెలియజేస్తూ మరోసారి ఎమోషనల్ అయ్యారు. ఇలా గీతూ తన ఎలిమినేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…