Actress Poorna: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ ఈ మధ్యకాలంలోనే షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ తెలియజేశారు. ఇక వివాహం తర్వాత పూర్ణ ఒకవైపు వ్యక్తిగత జీవితంలోను మరోవైపు వృత్తిపరమైన జీవితంలోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా పెళ్లి జరిగిన తర్వాత కూడా ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి పలు రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా పూర్ణ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులందరికీ చిన్నపాటి హెచ్చరికను తెలియజేశారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాలు అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అందరిని మోసం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సైబర్ నేరగాల్లో పెద్ద ఎత్తున సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఎంతో మందిని మోసం చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి పూర్ణ దృష్టికి వచ్చింది.కొందరు తన భర్త ఫోటోని వాట్సప్ ప్రొఫైల్ ఫోటోగా పెట్టడమే కాకుండా ఒక కొత్త నెంబర్ నుంచి కొందరు లావాదేవీలు జరుపుతున్నారనేది పూర్ణ దృష్టికి వచ్చింది.
ఈ క్రమంలోనే ఈమె ఆ నెంబర్ తో పాటు తన భర్త ఫోటో ప్రొఫైల్ గా ఉన్నటువంటి వాట్సప్ స్టేటస్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అది తన భర్త నెంబర్ కాదని ఎవరైనా ఈ నెంబర్ ద్వారా మోసపోతే అందుకు తన భర్త బాధ్యుడు కాదంటూ ఈమె తన అభిమానులకు ముందస్తు జాగ్రత్తగా చిన్నపాటి హెచ్చరిక చేశారు. ప్రస్తుతం పూర్ణ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…