Chethan Cheenu : మంత్ర 2, రాజుగారి గది వంటి హర్రర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చేతన్. తెలుగులో కంటే ముందే తమిళంలో పలు సినిమాల్లో నటించి, హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ నచ్చిన పాత్రలను చేస్తూ వచ్చాడు. ‘పెళ్లికి ముందు ప్రేమ కథ’ సినిమాలో తెలుగులో హీరోగా చేసిన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. చేతన్ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్, కళ్యాణిలకు బంధువు, సూర్యకిరణ్ వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. ఇక సినిమా అవకాశాల విషయంలో వారి హెల్ప్ ఎపుడు తీసుకోలేదని చెప్తూ ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలో మాత్రం సలహాలు తీసుకునేవాడిని అంటూ తన నేపథ్యం చెప్పారు. ఇక కళ్యాణి గారు ఎందుకు ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ చేయడం లేదు తెలుగు సినిమాల వైపు చూడటం లేదో వివరించారు.
అందుకే రీ ఎంట్రీ ఇవ్వలేదు…
కళ్యాణి గారు తెలుగులో హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సంప్రదాయంగా కనిపించే కల్యాణికి తెలుగులో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సత్యం సినిమా డైరెక్టర్ సూర్య కిరణ్ ను పెళ్లి చేసుకుని ఆ తరువాత సినిమాలను తగ్గించారు. అయితే సూర్యకిరణ్, కళ్యాణి లు తమ సొంత ప్రాజెక్ట్ గా చేసిన ‘చాప్టర్ 6’ అనే సినిమా సరిగా ఆడకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కళ్యాణి గారు దాదాపు తన ఆస్తులను పోగొట్టుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత సూర్యకిరణ్ తో విడిపోయి ప్రస్తుతం తన తల్లితో ఉంటున్నారు కళ్యాణి.
అయితే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నా మంచి కథతోనే రావాలని భావిస్తున్నారని తమ్ముడు చేతన్ చీను చెప్పారు. అయితే సొంత ప్రొడక్షన్ లో తక్కువ బడ్జెట్ లో ఒక సినిమాను చేస్తున్నారు కళ్యాణి. ఆ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ప్లాన్ చేసారు కళ్యాణి. అయితే ప్రొడక్షన్ చాలా కష్టమని మళ్ళీ నటిగా వెళ్లిపోవడం సులువుగా ఉంటుందంటూ చెప్తారట కళ్యాణి. ఇక ఈ విషయాలను చెబుతూ చేతన్ మళ్ళీ మంచి కథతో రీ ఎంట్రీ ఇస్తారు కళ్యాణి అక్క, తెలుగులోను మంచి ఆఫర్స్ వస్తున్నాయి, కథలను వింటున్నారు అంటూ చెప్పారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…