Categories: FeaturedMovie News

Bhanu Chander : స్నేహమంటే మాదే.. కానీ ఒకరోజు సుమన్ నన్ను కలవకు ఫోన్ కూడా చేయకు అని చెప్పాడు.. నేను షాక్ అయ్యాను. : భానుచందర్.

Bhanu Chander : ఓ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సుమన్, భానుచందర్ ఇద్దరు కాస్త విరామం దొరకడంతో.. మధ్యాహ్నం యూనిట్ సభ్యులు లంచ్ ఏర్పాటు చేశారు. టేబుల్ పై భోజనం చేస్తున్న సుమన్ ని కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తున్న భానుచందర్ ను ఏమిటి అలా చూస్తున్నారని సుమన్ ప్రశ్నించాడు. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుగు సినిమాల్లో ఎందుకు నటించకూడదని సుమన్ ను భానుచందర్ ఆతృతగా అడిగాడు. నాకు తెలుగు భాషలో ఓనమాలు కూడా రావు అలాంటిది తెలుగు సినిమాలలో నటించగలనా అని సుమన్ నెమ్మదిగా బదులిచ్చాడు. నువ్వు తెలుగులో నటించు కేవలం మూడు నెలల్లో తెలుగు చాలా చక్కగా మాట్లాడుతావు. పైగా మాకు తెలుగు నేర్పించేంతగా భాషాపటిమ నీకు వస్తుందని సుమన్ తో భానుచందర్ చెప్పారు.

అలా అన్నదే తడవుగా సుమన్ ని వెంటపెట్టుకొని తెలుగు సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ను కలిసి సుమన్ ని తెలుగులో పరిచయం చేయాలని భానుచందర్ ఆయనను కోరారు. ఆ విషయం పట్ల స్పందించిన నిర్మాత భరద్వాజ్ సుమన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. తమిళ సినిమా చేస్తున్న క్రమంలో ఒకరినొకరు కరాటేలో బ్లాక్ బెల్ట్ గా పరిచయం చేసుకుని అందులోని పోరాట సన్నివేశాలను వారిద్దరు చక్కగా చేశారు.ఆ క్రమంలో అప్పటి అప్ కమింగ్ రైటర్ భరత్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మంచి కథ తయారు చేశారు. కథ మాటలు చక్కగా కుదరడంతో ఈ సినిమాకి దర్శకునిగా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా ఎదుగుతున్న రేలంగి నరసింహారావు ని తీసుకున్నారు.

1983 చరితచిత్ర బ్యానర్, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో “ఇద్దరు కిలాడీలు” చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తరంగిణి చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సుమన్, శ్యామల గౌరీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దాదాపు 300 రోజులు ఆడింది. ఇలా వీరి కాంబినేషన్ లో అనేక చిత్రాలు ఆ తర్వాత కూడా విడుదలయ్యాయి. అలా ఒక రోజు మద్రాస్ లో పాండీ బజార్ వద్ద కారులో వస్తున్న భానుచందర్ కి ఎదురుగా మరో కారులో వస్తున్న సుమన్ ఢీకొట్టేంత దగ్గరగా వచ్చాడు. ఎవరో అనుకొని భానుచందర్ కారు డోర్ తీసుకొని కోపంగా అరవపోయాడు.

కానీ తీరా చూస్తే ఎదుటి కారులో సుమన్. ఆయన కారు దిగి.. భాను ఇక నన్ను ఎప్పుడు కలవకు.. ఫోన్ కూడా చేయకు అని చెప్పడంతో నేను ఎంతో షాక్ అయ్యాను. అసలేం జరిగిందని సుమన్ ని ఆరా తీయగా.. నన్ను ఒక కేసులో ముద్దాయిగా చేర్చారని నాతో నువ్వు క్లోజ్ గా ఉంటున్నావ్ కాబట్టి నిన్ను కూడా అందులో చేర్చే అవకాశం ఉందని నన్ను కొద్ది రోజులు కలవకు వీలైతే ఫోన్ కూడా చేయకు అని సుమన్ చెప్పారు. అలాంటి మంచి స్నేహితుడు సుమన్. సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా నా గురించి సుమన్ ఆలోచించారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో బాపూ, రమణల స్నేహం గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఆ తర్వాత స్నేహమంటే మా ఇద్దరిదేనని ఆ ఇంటర్వ్యూలో భానుచందర్ చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago