Child Artist Nithya Shetty: ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి తమ నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కొందరు పెద్దయిన తర్వాత ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మరికొందరు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై వారికి ఇష్టమైన వృత్తిలో స్థిరపడిన వాళ్లు ఉన్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారిలో దేవుళ్ళు సినిమాలోని నిత్య శెట్టి ఒకరు.
ఈమె దేవుళ్ళు సినిమాలో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు. ఇలా ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్య శెట్టి చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ సినిమాలకు ఉత్తమ బాలనటిగా అవార్డును అందుకున్నారు. ఇకపోతే 2015 వ సంవత్సరంలో దాగుడుమూతలు దండాకోర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు సినిమాలలో నటిస్తున్నారు.
తాజాగా నిహారిక కొణిదెల నిర్మాణంలో, శివ సాయి వర్దన్ దర్శకత్వంలో హలో వరల్డ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం మొత్తం సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ క్యాష్ ప్రోగ్రాంలో చూసిన ఎంతోమంది ప్రేక్షకాభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. దేవుళ్ళు సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఏనా ఇక్కడ ఇంత అందంగా ఉంది అంటూ ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…