Sarkaru Vari Pata: మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరికెక్కిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీ విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద మొదట్లో నెగిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ అనంతరం అత్యధిక కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్లో ఎంతో విజయవంతంగా ప్రదర్శన పూర్తి చేసుకొని తిరిగి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సాధారణంగా సినిమాని థియేటర్లో చూసినప్పుడు అందులో తప్పులను కనిపెట్టడం ప్రేక్షకులకు కష్టతరం. అయితే అదే సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సమయంలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇలా క్షుణ్ణంగా చూసిన నేపథ్యంలో అందులో తప్పులను ఎత్తి చూపెడుతుంటారు.
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో ఇలాంటి తప్పులను ఎన్నో కనిపెట్టారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటలో కూడా తప్పులను కనిపెడుతూ దారుణంగా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఢిల్లీ జైలులో జరిగే ఓ సన్నివేశం ఉంది. ఇందులో నటి నదియాను కలవడానికి మహేష్ బాబు వెళ్లేటప్పుడు విలన్ ని కూడా తీసుకొని వెళ్తాడు. అదే సమయంలో విలన్ ను పండ్లు తీసుకు రమ్మని మహేష్ బాబు చెబుతాడు.
ఇక మహేష్ బాబు విలన్ నదియాను కలిసినప్పుడు తనకు పండ్లు ఇస్తారు. అయితే ఆ పండ్లను ఆమె తీసుకోదు.నిజానికి అక్కడ పండ్లు తీసుకోవడానికి కూడా స్పేస్ లేకపోవడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ఈ తప్పును చూపెడుతూ పెద్ద ఎత్తున డైరెక్టర్ పరుశురామ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ లు చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…