Movie News

Cine Celebrities: ప్రెగ్నెంట్ కాకుండా సరోగసీ ద్వారా తల్లులైన సినీ సెలబ్రిటీలు వీళ్ళే?

Cine Celebrities: మాతృత్వం అనేది ప్రతి ఒక్క మహిళ అనుభూతి చెందే ఒక అద్భుతమైన వరం చెప్పాలి. తల్లిగా ఓ మహిళ ఎప్పుడైతే గౌరవాన్ని పొందుతారో అప్పుడే తన జీవితం సంపూర్ణం అని భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ తల్లి కావాలని ఆశ పడుతున్నా కొన్ని కారణాలవల్ల వారికి పిల్లలు కలిగే అదృష్టం ఉండదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అభివృద్ధి చెందిన వైద్య టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంతోమంది టెస్ట్ ట్యూబ్ బేబీ సరోగసి పద్ధతుల ద్వారా పిల్లలను కంటున్నారు. అయితే ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఎక్కువగా డబ్బున్న వాళ్లే సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు. మరి సినీ ఇండస్ట్రీలో ప్రెగ్నెంట్ కాకుండానే తల్లులైన సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం..

ప్రియాంక చోప్రా: బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంక చోప్రా వయసులో తనకన్నా 10 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పకుండా తల్లిని అయ్యాను అంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఈమె సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు.

గౌరీఖాన్: గౌరీకాన్ మొదటి ఇద్దరు పిల్లలకు స్వయంగా తానే జన్మనిచ్చినప్పటికీ తన మూడవ అబ్బాయి అక్బర్ ఖాన్ కి మాత్రం సరోగసి పద్ధతిలో జన్మనిచ్చారు. 40 సంవత్సరాల వయసులో ప్రెగ్నెంట్ కావడం వల్ల తన ప్రాణానికి ప్రమాదం ఉందని సూచించడంతో ఈమె సరోగసి ద్వారా మూడవ సంతానానికి జన్మనిచ్చారు.

సన్నీ లియోన్: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సైతం ఇద్దరు కవలలకు సరోగసి పద్ధతి ద్వారా జన్మనిచ్చారు. అయితే ఈమె మరొక అనాధ చిన్నారిని కూడా దత్తత తీసుకొని తన బాధ్యతలను చూసుకుంటున్నారు.

కిరణ్ రావ్: అమీర్ ఖాన్ కిరణ్ రావ్ దంపతులు కూడా సరోగసి పద్ధతి ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చారు.ఈమె పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ విధంగా సరోగసి ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చారు.

సరోగసి విధానం ఎంతో ఖర్చుతో కూడుకున్నది…

లక్ష్మీ ప్రసన్న: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసురాలిగా అందరికీ ఎంతో సుపరిచితమైన మంచు లక్ష్మీ ప్రసన్న సైతం సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఈమె గుజరాత్ కి చెందిన ఓమహిళ గర్భాన్ని అద్దెకు తీసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago