Featured

Child artist Sridevi : 15 సీరియల్స్, 10 సినిమాల్లో చేశా… బింబిసార మూవీ షూటింగ్లో కళ్యాణ్ రామ్ నన్ను ఎలా చూసుకున్నారంటే.. : చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి

Child artist Sridevi : ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రేక్షకులు మాట్లాడుతున్న సినిమాలు బింబిసార, సీతారామం. అయితే ఇందులో బింబిసార సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మంచి వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతూ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా చేరిపోయింది. ఇక సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి పాత్రకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నెట్టింట్లో ఆ అమ్మాయి ఎవరు అనే ఆరా తీయడం, ఆ చిన్నారి బ్యాక్ గ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నారు.

సీరియల్స్, సినిమాలతో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి…

ఇప్పటిదాకా 15 సీరియల్స్ లో నటించిన చిన్నారి శ్రీదేవి మొదటి సీరియల్ పున్నగా, ఇక యమలీల, కళ్యాణ వైభోగం వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు సినిమాల్లోను నటిస్తున్న ఈ చిన్నారి ఇపుడు 4 క్లాస్ చదువుతోంది. ఎల్కేజీ చదివే సమయంలోనే ఆర్టిస్ట్ గా మారిన ఈ చిన్నారి ఇప్పటికి దాదాపు 15 సీరియల్స్ లోను 10 సినిమాల్లోను నటించింది. మేజర్, రామారావు ఆన్ డ్యూటీ వంటి పెద్ద సినిమాల్లో నటించిన ఈ చిన్నారికి బింబసార విజయంతో మరింత ఎక్కువ అవకాశలు దక్కుతున్నాయి. అయితే సరైన పాత్రలనే చేయించాలని తండ్రి శ్రీహరి గౌడ్ అనుకుంటున్నారట. ఇక సినిమాలో నటించేటపుడు కళ్యాణ్ రామ్ చాలా బాగా చూసుకునేవాడంటూ, చాక్లేట్లు తెచ్చిచేవాడంటూ చెప్పింది శ్రీదేవి. ఇక తనికెళ్ళ భరణి తనతో ఆడుకునే వాడని, ఎలా చేయాలో చెప్పేవాడని, ప్రకాష్ రాజ్ కూడా ఎలా నటించాలో చెప్పేవారని శ్రీదేవి తన సినిమా అనుభవాలను పంచుకుంది.

ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఇప్పుడున్న చైల్డ్ ఆర్టిస్టుల్లో శ్రేదేవి దే ఎక్కువ రెమ్యూనరేషన్. ఇక ఈ సినిమా సక్సెస్ తో ఇంకా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తానని శ్రీదేవి తండ్రి చెప్పారు. ఇండస్ట్రీ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, చాలా డబ్బు కోల్పోయాను అందుకే పాప డిమాండ్ ను బట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటాను. అయితే పాప చదువును నిర్లక్ష్యం చేయడం లేదు అటు చదువు, ఇటు యాక్టింగ్ అన్నట్లుగా బాలన్స్ చేస్తున్నా అంటూ శ్రీహరి చెప్పారు. శ్రీహరి కూడా చాలా సీరియల్స్ లో నటించారు అలాగే వివిధ శాఖలలో సినిమా ఇండస్ట్రీ లో పనిచేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago