Child artist Sridevi : ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రేక్షకులు మాట్లాడుతున్న సినిమాలు బింబిసార, సీతారామం. అయితే ఇందులో బింబిసార సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మంచి వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతూ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా చేరిపోయింది. ఇక సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి పాత్రకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నెట్టింట్లో ఆ అమ్మాయి ఎవరు అనే ఆరా తీయడం, ఆ చిన్నారి బ్యాక్ గ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నారు.

సీరియల్స్, సినిమాలతో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి…
ఇప్పటిదాకా 15 సీరియల్స్ లో నటించిన చిన్నారి శ్రీదేవి మొదటి సీరియల్ పున్నగా, ఇక యమలీల, కళ్యాణ వైభోగం వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు సినిమాల్లోను నటిస్తున్న ఈ చిన్నారి ఇపుడు 4 క్లాస్ చదువుతోంది. ఎల్కేజీ చదివే సమయంలోనే ఆర్టిస్ట్ గా మారిన ఈ చిన్నారి ఇప్పటికి దాదాపు 15 సీరియల్స్ లోను 10 సినిమాల్లోను నటించింది. మేజర్, రామారావు ఆన్ డ్యూటీ వంటి పెద్ద సినిమాల్లో నటించిన ఈ చిన్నారికి బింబసార విజయంతో మరింత ఎక్కువ అవకాశలు దక్కుతున్నాయి. అయితే సరైన పాత్రలనే చేయించాలని తండ్రి శ్రీహరి గౌడ్ అనుకుంటున్నారట. ఇక సినిమాలో నటించేటపుడు కళ్యాణ్ రామ్ చాలా బాగా చూసుకునేవాడంటూ, చాక్లేట్లు తెచ్చిచేవాడంటూ చెప్పింది శ్రీదేవి. ఇక తనికెళ్ళ భరణి తనతో ఆడుకునే వాడని, ఎలా చేయాలో చెప్పేవాడని, ప్రకాష్ రాజ్ కూడా ఎలా నటించాలో చెప్పేవారని శ్రీదేవి తన సినిమా అనుభవాలను పంచుకుంది.

ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఇప్పుడున్న చైల్డ్ ఆర్టిస్టుల్లో శ్రేదేవి దే ఎక్కువ రెమ్యూనరేషన్. ఇక ఈ సినిమా సక్సెస్ తో ఇంకా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తానని శ్రీదేవి తండ్రి చెప్పారు. ఇండస్ట్రీ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, చాలా డబ్బు కోల్పోయాను అందుకే పాప డిమాండ్ ను బట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటాను. అయితే పాప చదువును నిర్లక్ష్యం చేయడం లేదు అటు చదువు, ఇటు యాక్టింగ్ అన్నట్లుగా బాలన్స్ చేస్తున్నా అంటూ శ్రీహరి చెప్పారు. శ్రీహరి కూడా చాలా సీరియల్స్ లో నటించారు అలాగే వివిధ శాఖలలో సినిమా ఇండస్ట్రీ లో పనిచేసారు.

































