సాధారణంగా జంతువులను పెంచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఎంతో ఆశ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది వారికిష్టమైన కుక్కలు పిల్లలను పెంచుకోవడానికి ఇష్ట పడుతుంటారు. ఎవరు కూడా ప్రాణాలకు హాని కలిగించే జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఓ వ్యక్తి మాత్రం పామును తన పెంపుడు జంతువుగా పెంచుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పామును తెచ్చుకొని ఇంట్లో పాలు పోసి పెంచుతున్నాడు. పామును ఎంతగా పెంచిన ఏదో ఒకరోజు దాని స్వభావం బయట పెడుతుంది. ఈ విధంగానే ఒకరోజు ఆ వ్యక్తి పామును పక్కలో పడుకో బెట్టుకున్నాడు… ఉదయానికి ఆస్పత్రి పాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే…
ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావీన్స్‌లో నివసిస్తున్న లియు అనే వ్యక్తి ఇటీవల ఒక మీటరు పొడవుండే విషం తీసేసిన నాగుపామును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. రోజు ఆ పాముని ఎంతో ముద్దు చేస్తూ పాముకు పాలు పోసి చూసుకునేవాడు. ఈ క్రమంలోనే ఒకరోజు రాత్రి పామును తన పక్కనే పడుకోబెట్టకున్నాడు. నిద్రమత్తులో ఆ వ్యక్తి పామును ఏం చేసాడో ఏమో కాని అతని తొడపై రెండు కాట్లు పడ్డాయి.
ఈ విధంగా పాము కాటు వేయడంతో ఎందుకైనా మంచిదని ఆ వ్యక్తి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తి కి ఫోన్ చేశాడు. ఈ విధంగా ఆ వ్యక్తికి ఫోన్ చేయడంతో పొరపాటున విషం తీయని పామును ఇచ్చానని చావు కబురు చల్లగా తెలిపాడు. ఈ విషయం విన్న లియు గుండె జారినంత పనైంది. వెంటనే హస్పిటల్‌కు పరుగులు పెట్టాడు.
సరైన సమయంలో స్పందించి వెంటనే ఆస్పత్రికి చేరుకోవడంతో లియు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు పెంచుకుంటున్న పాము ఎంతో విషపూరితమైనదని ఏ మాత్రం ఆలస్యం చేసిన అతడి కాలు పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి ఉండేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ద్వారా నిజం గ్రహించిన లియు ఇకపై ఎప్పుడు పెంపుడు జంతువులను పెంచుకోనని తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…