సాధారణంగా మనం పొలం పనికి వెళ్ళినప్పుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పొలంలో ఏదైనా పంటను వేయాలన్న లేదా కలుపు తీయాలన్న, పండిన పంటను కోయాలన్న నిరంతరం వంగి, కూర్చొని, నిలబడి పనులు చేయడం చేస్తుంటాము. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలాగే పని చేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి కష్టమైన పని చేయలేని ఓ రైతుకు కత్తిలాంటి ఆలోచన తట్టింది.
తన పొలంలో ఏ మాత్రం కష్ట పడకుండా ఎంచక్కా పడుకొని వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచన తట్టింది.ఆలోచన రావడమే ఆలస్యం వెంటనే ఆచరణలో పెట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇంతకీ ఆ రైతుకు వచ్చిన ఆలోచన ఏమిటంటే… వంగి తోట పనులు చేయాలంటే ఎంతో కష్టం కనుక పడుకొని పనులు చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే తన మంచానికి నాలుగు వైపుల నాలుగు చక్రాలను బిగించి తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు.
రైతు పడుకునేటటువంటి మంచానికి నాలుగు వైపుల నాలుగు చక్రాలను అమర్చి ఆ మంచాన్ని పొలంలోకి తీసుకువెళ్ళాడు. ఆ మంచంపై బోర్లా పడుకొని పొలంలో ఎంతో సులభంగా పనులు చేసుకోగలుగుతున్నాడు.ఈ విధంగా ఈ రైతు చేసిన పనిని చూసి సదరు రైతులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ రైతు చేస్తున్న వ్యవసాయ పనులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు అతనికి వచ్చిన ఐడియా పై పలు రకాలుగా స్పందించి కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి ఈ విధంగా ట్రై చేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…