టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా పలు సినిమాల్లో నటించిన అడవి శేష్.. ఆ తర్వాత హీరోగా మారి ఇండ్రస్టీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మూస పద్ధతిలో ఉండే సినిమాలకు ఆమడ దూరంలో ఉండే హీరో అడివి శేష్. తానూ చేసే ప్రతి కథలో వైవిద్యం కోరుకునే ఈ హీరో తన కెరీర్‌లో సొంతం చేసుకున్న విజయాల సంఖ్య తక్కువగా ఉన్నా.. యూత్‌లో మాత్రం మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. వైవిధ్యభరితమైన చిత్రాలకు తన టాలెంటెడ్ జోడించి సక్సెస్ అందుకుటున్న ఈ హీరో ప్రస్తుతం ‘మేజర్’, ‘హిట్ 2’ సినిమాలలో నటిస్తున్నాడు.. అయితే తాజాగా ఈ కుర్ర హీరో ప్రేమలో పడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
తాజగా ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన అడవి శేష్ అందులో తానూ ఒక హైదరాబాదీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. కాకపోతే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు ఇప్పట్లో లేదని తేల్చిచెప్పాడు. ఆమె వివరాలు చెప్పేందుకు ఆమె అనుమతి తీసుకోలేదని, కాబట్టి తన గురించి చెప్పడానికి కుదరదని తెలిపాడు.. దీంతో అడివి శేష్ అభిమానులు ఎప్పుడు పరిచయం చేస్తాడా అని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం మేజర్ సినిమాలో అడవి శేష్ నటిస్తున్నాడు. GMB బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదలై ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకుంది.ఆగస్టు లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్…!!
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…