Mahesh Babu: మహేష్ బాబు నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రిటీలు ఈయనకు పుట్టినరోజు వేడుకలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్లో ఎవర్గ్రీన్ హిట్ సినిమా అయినటువంటి మురారి సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ సినిమాలో నటించిన నటీనటులు ఇంటర్వ్యూలకు హాజరవుతూ మురారి సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా నటుడు చిన్నా సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మహేష్ బాబు మంచితనం గురించి తెలియజేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్లో భాగంగా మేము రామచంద్రపురం అనే ఊరిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే నాకు ప్రొడక్షన్ వారు పెట్టే ఫుడ్ ఏ మాత్రం పడలేదు తద్వారా ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నాను. అవుట్ డోర్ షూటింగ్ కావడంతో ఇంటి నుంచి క్యారేజ్ రావడానికి కూడా వీలు లేదు.
చాలా మంచిగా చూసుకున్నారు..
ఇక మహేష్ బాబుకి మాత్రం ప్రొడ్యూసర్ చెల్లి ఇంటి నుంచి క్యారేజ్ వచ్చేది. నేను వెళ్లి నాకు ఈ ఫుడ్ పడలేదని నా సమస్యను మహేష్ బాబుకి చెప్పాను. వెంటనే ఆయన తన కోసం వచ్చే క్యారేజ్లో తినమని చెప్పారు. కొన్నిసార్లు షూటింగ్ వల్ల మహేష్ బాబు తినడం ఆలస్యమైతే మీరు వెళ్లి భోజనం చెయ్యండి అని నాకు చెప్పేవారు. అక్కడ షూటింగ్ చేసినన్ని రోజులు మహేష్ నన్ను చాలా బాగా చూసుకున్నారంటూ చిన్నా చేసిన ఈ కామెంట్స్ పట్ల మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…