Chiranjeevi : మెగాస్టార్ చిరు ఇప్పుడు సినిమాల జోరు కొంచెం తగ్గించారు కానీ 90 లలో చిరుకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ గా ఏ సినిమా తీసినా బంపర్ హిట్ అనే రేంజ్. అది కాక మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ తో ఉన్నారు. ఇక అప్పటికే రామ్ గోపాల్ వర్మ అనే ఒక కొత్త దర్శకుడు శివ అనే సినిమా తీసి సంచలన విజయం నమోదు చేసాడు. ఇక రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడితో, మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అంటే ఇంకెలా ఉంటుంది.
చిరంజీవి, ఆర్జీవి కాంబినేషన్, అశ్వనిదత్ ప్రయత్నం…
ఇక అలాంటి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్లు సెట్ చేసే వారిలో ముందుండే అశ్వనీదత్ ఆర్జీవిని కలిసి చిరుతో సినిమా గురించి చెప్పాడు, ఇందుకు ఆర్జీవి ఒకే అన్నాడు. ఇక చిరుతో కూడా ఈ కాంబినేషన్ గురించి చెప్పగా అప్పటికే రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయాలని ఆసక్తిగా ఉన్న చిరు వెంటనే ఓకే చేసారు. ఆ సమయంలో చిరు ఆల్రెడీ హిట్లర్ సినిమా కోసం నెల రోజుల కాల్షీట్లు ఇచ్చేసారు. కానీ వర్మ రావడం, కథ నచ్చడంతో నెలలో పదిహేను రోజులు హిట్లర్ సినిమా కోసం పదిహేను రోజులు ఆర్జీవి కోసం ఇచ్చారు. ఇక ఆర్జీవి అప్పుడు సంజయ్ దత్, ఊర్మిళ జంటగా దౌడ్ సినిమా చేస్తున్నారు. ఇక అనుకోని పరిస్థితుల్లో సంజయ్ దత్ జైలు కి వెళ్లడంతో ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది.
ఇక చిరుతో సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు ఆర్జీవి. చిరు కి జంటగా ఊర్మిళ హీరోయిన్, 1996 లో కర్ణాటక లో మొదట షూటింగ్ ప్రారంభించారు. ఒకే పాట, కొంత షూటింగ్ పూర్తయ్యాక సంజయ్ దత్ జైల్లో నుండి బయటికి రావడంతో ఆర్జీవి ఆ షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమా తీస్తానని చెప్పడంతో చిరు ఒప్పుకున్నారు. ఇక దౌడ్ సినిమా షూటింగ్ నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఇక చిరు హిట్లర్ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇక మూడు నెలలు ఆర్జీవి కోసం చిరు ఎదురుచూసాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, కొత్త సినిమా ఒప్పుకుందామన్నా క్లారిటీ లేదు. దీంతో మూడు నెలలు ఓపిగ్గా ఎదురుచూసిన చిరు చేసేదేమి లేక ఆ సినిమాను వదిలేసి కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చేసారు. అలా ఆర్జీవి, చిరు కాంబినేషన్ సినిమా అటకెక్కింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…