Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నాలుగు పదుల సినిమా ప్రయాణంలో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు. అందులో కొంతమంది హిట్ పెయిర్ గా నిలిస్తే కొంతమంది మాత్రం జోడి సెట్ అవ్వలేదు అనట్టుగా అనిపించారు. అయితే అందరి హీరోయిన్లతోను మంచి స్నేహం కొనసాగించారు చిరంజీవి. తన సినిమా కెరీర్ లో రాధిక, విజయశాంతి, రాధా లాంటి వారు చిరుకి హిట్ పెయిర్ గా నిలిచారు. వీరితో ఎక్కువ సినిమాలు కూడా చేసారు. ఇక బాను ప్రియ, సౌందర్య, సిమ్రాన్ వంటి వారితో మంచి కెమిస్ట్రీ పండించారు. ఇక తన సినిమా కెరీర్ లో చిరు అంటే నచ్చని హీరోయిన్లు లేరు. కానీ ఒక ఇద్దరు హీరోయిన్లు మాత్రం చిరు అంటే ఎందుకో నచ్చలేదు.
చిరు కి ఆ ఇద్దరు హీరోయిన్లకు మధ్య గ్యాప్…
చిరంజీవి తొలి రోజుల్లో నటిస్తున్న సమయంలో మాధవి గారితో నటించారు. చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాలో మాధవి గెస్ట్ రోల్ వేశారు. ఇక ఆ తరువాత కుక్క కాటుకి చెప్పు దెబ్బ, కోతల రాయుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఖైదీ సినిమాలో చిరు కి జంటగా నటించారు అయితే ఆ సినిమాల సమయంలో మాధవి చిరంజీవి గారితో మాట్లాడేవారు కాదట. మొదట్లో కొంత చిరు అంటే చులకన భావం ఉండటం, ఆ తరువాత కూడా ముభావంగా ఉండేది. ఇక చిరంజీవి గారు సురేఖను పెళ్లి చేసుకున్నాక ఆమె లో మార్పు వచ్చింది.
సురేఖ తో ఉన్న బంధమే దానికి కారణం. చిట్టక్క అని సురేఖను మాధవి పిలిచేదట. అంతటి సాన్నిహిత్యం ఉండటం వల్ల మెల్లగా చిరంజీవి గారితో కూడా బాగానే మాట్లాడేవారట మాధవి. ఇక మరో హీరోయిన్ నగ్మా, ఘరానా మొగుడు సినిమాలో మొదటి సారిగా చిరుతో కలిసి నటించింది. ఆ సినిమాలో మొదట హీరోయిన్ గా విజయశాంతిని అనుకున్నా ఆమె డేట్స్ కుదరక వేరే హీరోయిన్ కోసం వెతికారు. ఇక అంత వరకు పెద్ద హీరోలతో చేయని నగ్మాకు మొదటిసారి చిరుతో కలిసి నటించే అవకాశం వచ్చింది. అప్పుడు ఆమె పారితోషకం నాలుగు లక్షలు. ఇక ఆ సినిమా పెద్ద హిట్ తరువాత నగ్మా మళ్ళీ మరోసారి చిరుతో ముగ్గురు మొనగాళ్లు సినిమాలో నటించింది.
ఘరానా మొగుడు సినిమా విజయం తనదే అన్న పొగరు నగ్మాకి పెరిగింది. సినిమా చిరు సొంత సినిమా కావడం నాగబాబు నిర్మాత కావడంతో నగ్మా నాగబాబుకి చుక్కలు చూపించింది. నడుము నొప్పి అది అంటూ షూటింగ్ కి డుమ్మా కొట్టింది. ఇక మళ్ళీ రిక్షావోడు సినిమాలో మళ్ళీ నగ్మా, చిరు కలిసి నటించారు. ఇక ఈసినిమా సమయంలో పాటల షూటింగ్ అప్పుడు నగ్మా చాలా ఇబ్బంది పెట్టిందట. దీంతో ఇంతకాలం ఓపిక పట్టిన చిరు ఇక నగ్మాను డ్రెస్సింగ్ రూమ్ కి పిలిచి క్లాస్ పీకారట. పద్ధతి మార్చుకో లేదంటే చాలా ఇబ్బంది పడుతావు అంటూ హితవు చెప్పారట. రెండు రోజులు ముభావంగా ఉన్న నగ్మా ఆ తరువాత మళ్ళీ షరా మామూలే అన్నట్టు తయారైంది. ఇక ఈ సినిమా తరువాత చిరు మరో సినిమాలో నగ్మాకు అవకాశం ఇవ్వలేదట. ఇక తెలుగులో కూడా నగ్మాకు సినిమా అవకాశాలు తగ్గాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…