Featured

Chiranjeevi : సురేఖ తో పెళ్లి చూపులు… ఊ అనాలా… ఊ ఊ అనాలా అని ఆలోచించా… సురేఖ చేసిన పనికి ఊ అనేసాను : మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. ఆయన కష్టపడి ఒక్కో మెట్టెక్కి పైకి వచ్చి కిందున్న ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. ఇపుడున్న వర్ధమాన నటులు ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి. ఆయనకు ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. అలాంటి మెగాస్టార్ గారి కుటుంబం ఎంతో అన్యోన్యంగా చక్కగా ఉందంటే దానికి ఖచ్చితంగా కారణం ఇంటి బాస్ సురేఖ గారే. సినిమాల్లో ఆయన మెగాస్టార్ అవ్వొచ్చు కానీ ఇంట్లో మాత్రం మెగాస్టార్ బాస్ సరేఖ గారే. వాళ్ళ పెళ్లి పెద్దలు కుదిర్చినది. ఇక అప్పటి పెళ్లి విషయాలను చిరు గారే స్వయంగా చెబుతూ నవ్వులు పూయించేశారు.

కాఫీ తో పడగొట్టేసింది…

దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి శత జయంతి దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో వేడుకలను నిర్వహించారు. అందులో మాజీ ఉపరాష్ట్రపత్తి వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి, ఆయన కుటుంబం ఇంకా తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో భాగంగా అల్లు రామలింగయ్య గారితో చిరంజీవికి ఉన్న అనుబంధాన్ని అలాగే సురేఖతో జరిగిన పెళ్లి తంతు ముందు విషయాలను సరదాగా పంచుకున్నారు చిరు. అల్లు రామలింగయ్య గారు చిరంజీవి కి ఒక మార్గదర్శి లాగా ఉండి తొలినాళ్ళలో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇక చిరంజీవి అయితే తన కూతురికి చక్కగా సరిపోతాడని భావించి అల్లు రామలింగయ్య గారు చిరంజీవి ని సురేఖ తో పెళ్లి గురించి అడిగారట. కానీ చిరు అప్పుడప్పడే ఇంకా సినిమాల్లో ఎదుగుతున్న క్రమంలో అపుడే పెళ్లి వద్దని చెప్పారట.

కానీ అల్లు రామలింగయ్య గారు ఈ పెళ్లి ప్రస్తావన చిరంజీవి తండ్రి గారి వద్దకు తీసుకెళ్లారు. ఇక ఆయన బలవంతం చేయడంతో మొహమాటంతో కాదనలేక పెళ్లి చూపులకు వెళ్లారట. అక్కడ మెడలో దండ వేసి బలికి గొర్రెను తీసుకువెళ్లినట్లు తీసుకెళ్లారట. అక్కడ సురేఖ గారిని ఒకసారి చూసి ఇంకోసారి చూడాలనిపించి చూశారట. ఇక ఊ అనాలా ఊఉ అనాలా అనే అయోమయం లో ఉంటే ఆవిడ చేతి కాఫీ తాగి కళ్ళు మూసుకుని ఓకే అనేశారట, కళ్ళు తెరిచేసరికి పెళ్లి అయిపోయిందంటూ సరదాగా చంత్కరించారు చిరు. అయినా సురేఖ గారు ఇంటిని అంత చక్కగా చూసుకున్నారు కాబట్టే చిరంజీవి గారు మెగాస్టార్ అవ్వగలిగాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago