Chiranjeevi: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి జీవితం పుస్తక రూపంలోకి రాబోతుందట. ఆయనపై ఆటోబయోగ్రఫీ రానుంది. ఇదే విషయాన్నీ తాజాగా చిరంజీవి ప్రకటించారు. మరి చిరంజీవి ఆటో బయోగ్రఫీని ఎవరు రాస్తున్నారు అన్న వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అయినా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి వారిపై పుస్తకాలు రాశారు రచయితలు, జర్నలిస్టులు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో తీసుకుని పుస్తకాలు రాశారు. అలాగే చిరంజీవిపై కూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ పూర్తిగా ఆయన జీవితాన్ని ఆవిష్కరించే ఆటో బయోగ్రఫీ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. తాజాగా ఆ పుస్తకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
త్వరలో మెగాస్టార్ చిరంజీవి ఆటోబయోగ్రఫీ రాబోతుంది. అది ఒక స్టార్ రైటర్ రాయబోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు రాసి స్టార్ రైటర్‌గా పేరుతెచ్చుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఈ పుస్తకాన్ని రాయబోతున్నారు. తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ 28వ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్, ఏఎన్నార్ లను గుర్తు చేసుకుంటూ ఓకే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. యండమూరి వీరేంద్రనాథ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన సినిమాల్లో ఆయన పాత్ర ఎంతో ఉందని, ఆయన రాసిన పుస్తకాల ఆధారంగానే ఎన్నో సినిమాలు చేసినట్టు తెలిపారు.
నా స్టార్ డమ్ కి ఆ స్టోరీలే కారణం..
ఒక రకంగా తనకు స్టార్ డమ్ తెచ్చిన సినిమాలకు ఆయన రాసిన స్టోరీలే కారణమని అన్నారు చిరు. 80వ దశకంలో చాలా వరకు ఆయన రాసిన రచనలు, కథలు, పాత్రలు తనకు స్టార్ డమ్ రావడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఆ క్రెడిట్ యండమూరికే దక్కుతుందని చెప్పారు. మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా ఆయన సినిమానే కారణమన్నారు చిరు. అభిలాష పుస్తకాన్ని తన అమ్మ ముందుగా చదివి చెప్పిందని, ఆ రెండు మూడు రోజులకే మద్రాస్‌లో అదే కథతో కేఎస్ రామారావు తనతో సినిమా చేసేందుకు వచ్చారని తెలిపారు. అందులో హీరో పాత్ర కూడా చిరంజీవినే అని, అది కాకతాళియమో ఏమోగానీ, ఆ సినిమా నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమా పెద్ద విజయం సాధించి తనలో నమ్మకాన్ని పెంచిందని, ఇక మనకు తిరుగులేదనే నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…