Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆగస్టు 11వ తేదీ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి అలాగే నిర్మాత అనిల్ సుంకర గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.. రెమ్యూనరేషన్ విషయంలో వీరిద్దరికి గొడవ చోటు చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
చిరంజీవి ఈ సినిమా కోసం 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ముందుగానే 50 కోట్లు ఇచ్చారని అయితే విడుదల తర్వాత పది కోట్ల రూపాయలు తీసుకుంటానని చెప్పారట ఈ పది కోట్ల రూపాయలను రూపంలో అందించాలని భావించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా డిజాస్టర్ అందుకోవడంతో చిరంజీవి ఆ 10 కోట్ల రూపాయలను తిరస్కరించారట.
సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో నిర్మాతలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే చిరంజీవి మిగిలిన 10 కోట్ల రూపాయలను తిరిగి వెనక్కి ఇచ్చేసారని తెలుస్తుంది.చిరంజీవి గతంలో కూడా ఇలా నిర్మాతల గురించి ఆలోచించి తన సినిమాలు డిజాస్టర్ అయిన సమయంలో రెమ్యూనరేషన్ కొంత మొత్తంలో వెనక్కి తిరిగి ఇచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…