Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫిలింనగర్ లో ఉన్నటువంటి ఓ ఖరీదైన ఫ్లాట్ అమ్మారని గత రెండు రోజులగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం ఒక దినపత్రిక యజమాని ఒత్తిడి చేయడం వల్ల మెగాస్టార్ చిరంజీవి ఆస్తిని దాదాపు 70 కోట్లకు అమ్మినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా చిరంజీవి ఆస్తి గురించి వార్తలు రావడంతో ఈ వార్తలపై మెగా సన్నిహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు అమ్మారంటూ వస్తున్నటువంటి వార్తలలో కొంతవరకు మాత్రమే నిజం ఉందని కొన్ని మీడియా చానల్స్ అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం కొందరి ఒత్తిడి కారణంగా చిరంజీవి ఆస్తి అమ్మారనీ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఆ వార్తలను కొట్టి పారేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మొదట్లో ఈ ఆస్తులను కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఆస్తికి భారీ మొత్తంలో డీల్ రావడంతోనే ఆయన ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ ఆస్తిని అమ్మినట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఫినిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు తన ఆస్తిని అమ్మారని వెల్లడించారు.
ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సమస్త మెగాస్టార్ చిరంజీవి ప్రాపర్టీ కి ఫ్యాన్సీ డీల్ ఆఫర్ చేయడంతోనే తన ప్రాపర్టీకి మంచి ధర పలుకుతుందని భావించిన చిరంజీవి స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఈ ఆస్తిని అమ్మారని ఎవరో ఒత్తిడి చేయడం వల్ల ఈ ఆస్తిని అమ్మలేదని క్లారిటీ ఇచ్చారు. ఒత్తిడి వల్లే చిరంజీవి అమ్మారంటూ వచ్చిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…