Sri Reddy: చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. శ్రీజ శిరీష్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా వీరిద్దరూ 2007వ సంవత్సరంలో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది.
కొన్ని మనస్పర్ధలు కారణంగా శ్రీజ ఒక పాప జన్మించిన తర్వాత 2014వ సంవత్సరంలో తన భర్త శిరీష్ భరద్వాజకు విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు వచ్చారు. అనంతరం ఈమె 2016వ సంవత్సరంలో కళ్యాణ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇక శిరీష్ సైతం 2019 లో మరొక వివాహం చేసుకున్నారు.
ఇలా రెండో వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధి సమస్యతో బాధపడుతూ గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈయన మరణం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సంచలన తారా శ్రీరెడ్డి శిరీష్ మరణం పై స్పందించారు.
అందరూ మోసం చేశారు..
శిరీష్ మరణ వార్త గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. శిరీష్ భరద్వాజ్ (చిరంజీవి మాజీ అల్లుడు) ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది రా అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన సంచలనంగా మారుతూ ఉంటాయని మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…