Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి మెగా సామ్రాజ్యాన్ని విస్తరింప చేశారు.ఇలా చిరంజీవి నటుడుగా కొనసాగుతూనే తన తమ్ముడు నాగబాబు పవన్ కళ్యాణ్ ని కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ సాధించిన నాగబాబు మాత్రం సక్సెస్ కాలేకపోయారు.
నాగబాబు హీరోగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ సహాయ నటుడి పాత్రలలో నటిస్తూ సందడి చేశారు అదేవిధంగా నిర్మాతగా కూడా స్థిరపడ్డారు. వీరి సినీ కెరియర్ గురించి అందరికీ తెలిసిందే.చిరంజీవి భార్య సురేఖ అల్లు రామలింగయ్య కుమార్తె వారి సినీ బ్యాగ్రౌండ్ మనకు తెలిసిందే. కానీ నాగబాబు భార్య పద్మజ గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే పద్మజ మెగా కుటుంబానికి కోడలుగా ఎలా అడుగు పెట్టారు అనే విషయానికి వస్తే…
మెగా కుటుంబ సభ్యులందరూ పాలకొల్లులోని తమ సమీప బంధువుల వివాహానికి వెళ్లారట అయితే అక్కడ పద్మజను చూసిన అంజనదేవి ఎలాగైనా ఈ అమ్మాయిని తన రెండో కోడలుగా చేసుకోవాలని భావించడమే కాకుండా వెంటనే తన కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకొని నాగబాబుకు సంబంధం మాట్లాడారట.ఇలా నాగబాబుకు పద్మజతో సంబంధం కుదరడంతో అతి తక్కువ సమయంలోనే వీరిద్దరి వివాహం ఎంతో ఘనంగా చేశారు.
మెగా ఇంటికి పద్మజ కోడలిగా అడుగుపెట్టారు కానీ పెళ్లికి ముందే ఈమె మెగాస్టార్ చిరంజీవికి చాలా పెద్ద అభిమాని.చిరంజీవి ఫోటోలు ఏదైనా పేపర్లో కనిపిస్తే చాలు వెంటనే వాటిని కట్ చేసి పెద్ద ఎత్తున ఒక బుక్ కూడా ప్రిపేర్ చేసిందట. ఇలా పెళ్లికి ముందే చిరంజీవికి పద్మజ పెద్ద అభిమాని అవ్వడమే కాకుండా ఏకంగా తన అభిమాన హీరో ఇంటికి మరదలుగా ఆమె అడుగు పెట్టడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…