Sudhakar: ఎన్నో తెలుగు సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుధాకర్ ఒకానొక సమయంలో తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన విషయం మనకు తెలిసిందే. అయితే కొందరు తన కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టడంతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి కమెడియన్ గా స్థిరపడ్డారు.
ఇలా కమెడియన్ గా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇకపోతే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న నేను నాన్న అనే స్పెషల్ షో లో ఈయన సందడి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి ఈయన అనంతరం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
ముందుగా తాను చనిపోయాను అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కానీ తాను క్షేమంగా ఉన్నాను అలాంటి వార్తలు సృష్టించద్దని తెలియజేశారు. అలాగే తను ఒక్కసారి వెనక్కితిరిగి చూసుకుంటే హీరోగా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి పాత్రలలో నటించానని చాలా సంతోషం వేస్తుందని తెలిపారు. ఇక తనకు తెలుగులో ఎమ్మెస్ నారాయణ అంటే చాలా ఇష్టమని సుధాకర్ తెలిపారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకు ఉన్న స్నేహం గురించి కూడా తెలిపారు. తాను చిరంజీవి ఇద్దరు ఒకే రూమ్లో ఉండే వాళ్ళమని తెలిపారు.అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇక యముడికి మొగుడు సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టడంతోనే ఈ సినిమాలో నటించాలని ఈ సందర్భంగా చిరుతో ఉన్నటువంటి స్నేహం గురించి కూడా గుర్తుచేసుకున్నారు. ఇక త్వరలోనే తన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని సుధాకర్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…