JD Chakravarthy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి జే డీ చక్రవర్తి ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన తాజాగా దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా ఈయన ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగా జెడి చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని గతంలో జయసుధ విషయంలో తన భర్తతో తనకు జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ గురించి తెలియజేశారు.జయసుధ భర్త నితిన్ వద్దకు వెళ్లి తాను నేరుగా జయసుధని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను అంటూ ఈయన కామెంట్ చేశారు. నితిన్ చూడటానికి ఆరడుగుల ఉంటారు. లాగిపెట్టి కొడితే ఒక మూడు నెలలు నేను పైకి లేవలేను.
అయినప్పటికీ చాలా డేర్ చేసి నేను జయని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. తాను ఇలా చెప్పడంతో నేను కూడా సరదాగా చెబుతున్నానని తనకు అర్థం అయింది.నేను జయని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే నితిన్ ఒకటే మాట మాట్లాడారు నేను జయసుధ పెళ్లి చేసుకున్న రోజునే మీరు కూడా పెళ్లి చేసుకోండి ఎందుకంటే ఇద్దరిదీ ఒకటే పెళ్లి రోజు అవుతుంది కేవలం హస్బెండ్ మాత్రమే వేరే అవుతారు అంటూ సమాధానం చెప్పారు.
జయసుధను పెళ్లి చేసుకుంటాను అంటే తన భర్త ఇలాంటి సమాధానం చెప్పారంటూ చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే జయసుధ భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక జయసుధ ప్రస్తుతం పలు సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…