Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి చిత్రం పుష్ప2. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం అంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఇలా సినిమా షూటింగ్ సమయంలో సినిమాకు సంబంధించి ఎలాంటి సన్నివేశాలు లీక్ అవ్వకుండా మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సినిమా నుంచి ఎన్నో సన్నివేశాలు లీక్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాము.
ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాల నుంచి కీలక సన్నివేశాలు లీకైన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటిని కట్టడి చేయడానికి మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాని పనిలా మారిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వీడియో లీక్ అయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలిస్తున్నటువంటి లారీలను చేజ్ చేస్తూ ఉన్నట్టు ఈ వీడియోలో మనం చూడవచ్చు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించినటువంటి యాక్షన్ సన్ని వేషాలు ఇలా లీక్ అవడంతో ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…