Categories: FeaturedMovie News

Custody Movie: అక్కడ హిట్ కొట్టకపోయినా… ఓటీటీలో దూసుకుపోతున్న నాగచైతన్య కస్టడీ!

Custody Movie: అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు నాగచైతన్య వచ్చారు. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.

దాదాపు ఈ సినిమా ద్వారా నిర్మాతలు 17 కోట్ల వరకు నష్టపోయారని తెలుస్తుంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో మే 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన కస్టడీ సినిమా ఓటీటీలో మాత్రం పరవాలేదు అనిపించుకుంది.
ఈ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉండడంతో వ్యూవర్ షిప్ కూడా పెరుగుతుంది.

Custody Movie: ఓటీటీలో సక్సెస్ కొట్టిన చైతన్య…


ఏది ఏమైనా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago