Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా అగ్ర శిఖరానికి చేరుకున్న చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దగా నిలబడ్డారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తన వంతు సహాయం చేస్తూ అందరిని ఆదుకుంటున్నాడు.
ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమంది ఆర్టిస్టులను ఆదరించి వారికి సహాయ సహకారాలు అందించాడు. అంతేకాకుండా తాజాగా బలగం సినిమా ద్వారా గుర్తింపు పొందిన సింగర్ కి కూడా ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ఆయన ఆరోగ్యానికి కావాల్సిన చికిత్స కూడా ఉచితంగా చేయిస్తానని మాట ఇచ్చాడు. అయితే చిరంజీవి ఎంతమందికి సహాయం చేసినా కూడా తాను సహాయం చేసిన విషయాన్ని నలుగురిలో బయటపెట్టకుండా చాలా గుట్టుగా ఉంచుతాడు.
అందువల్ల ఆయన సినిమాలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా రియల్ హీరో అని అభిమానులు పొగుడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి చేసిన మరొక మంచి పని గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తాము చదివిన కళాశాల బాగు కోసం అంతో ఇంతో సహాయం చేయాలనుకుంటారు. అలాగే చిరంజీవి కూడా తాను చదివిన కాలేజీ కోసం పెద్ద మొత్తంలో సహాయం చేసినట్లు ఆ కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.
చిరంజీవి తాను చదివిన వై ఎన్ కాలేజీ అభివృద్ధి కోసం తాను ఎంపీగా ఉన్న సమయంలో 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, అంతేకాకుండా తాను సొంతంగా కూడా కాలేజీ అభివృద్ధి కోసం కొంత మొత్తం సహాయం చేసినట్లు కాలేజీకి రెస్పాండెంట్ సత్యనారాయణ వెల్లడించాడు. ఈ విషయం తెలియడంతో చిరంజీవి మీద అభిమానులు ప్రశంసలకు కురిపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…