Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈయన సినిమాల విషయంలో చిరంజీవి మరొక హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత ఈయన నటించే ప్రతి సినిమాలో కూడా మరొక యంగ్ హీరో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ విధంగా చిరంజీవి సినిమాలలో మరొక యంగ్ హీరో ఉంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ దర్శక నిర్మాతలలో ఉంది. అందుకే చిరంజీవి సినిమాలలో ప్రత్యేకంగా మరొక యంగ్ హీరోకి ఒక పాత్రను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఇకవాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ రవితేజతో కలిసి చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో కూడా మరొక యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందన్న ధీమాలో మెగా అభిమానులు దర్శక నిర్మాతలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో కూడా సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్రలో నటించబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే బింబి సార డైరెక్టర్ తో చిరంజీవి మరొక సినిమా చేయబోతున్నారట ఇందులో కూడా ఒక హీరోకి కీలక పాత్ర ఉండబోతున్నట్టు సమాచారం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…