Rakesh master 3rd wife Lakshamamma: ఎంతో పేరు ప్రఖ్యాతలు తన ప్రతిభతో సంపాదించి తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన రాకేష్ మాస్టర్ జీవితం అందరికీ ఒక గుణపాఠమనే చెప్పాలి. చేతిలో రూపాయి లేకుండా కేవలం తన టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చిన రాకేష్ మాస్టర్ తన డాన్స్ తో అద్భుతం చేసాడు. తాను ఎదగడమే కాకుండా ఎంతో మంది శిష్యులను తయారు చేసి నేడు ఇండస్ట్రీలో తెలుగు డాన్స్ మాస్టర్స్ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటేలా చేసాడు. అలాంటి రాకేష్ మాస్టర్ తన తుది దశలో కేవలం మద్యానికి బానిస అవ్వడం వల్ల తన జీవితం నాశనం చేసుకున్నాడు. ఆయన చనిపోవడానికి కారణం ఆయనకు వంట చేయడానికి అంటూ వచ్చి మూడో భార్య అంటూ చెప్పుకున్న లక్ష్మమ్మ అంటూ రాకేష్ మాస్టర్ సన్నిహితులు చెబుతారు. ఆమె వల్ల రాకేష్ మాస్టర్ మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్తారు. తాజాగా లక్ష్మమ్మ ను హైదరాబాద్ లో ఐదుమంది కలిసి బాగా కొట్టారు.
యూట్యూబ్ గొడవలే కారణం…
రాకేష్ మాస్టర్ మరణించాక కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడుతూ వీడియోలను తీస్తూ యూట్యూబ్ లో పెట్టిన లక్ష్మమ్మ మీద నెగెటివిటీ బాగానే ఉన్న తన మీద ఐదు మంది వ్యక్తులు దాడి చేయడంతో మరో సారి వైరల్ అయింది. అయితే తన మీద దాడికి పాల్పడిన వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ లో కలిసి వీడియోలను చేసుకున్న వాళ్ళని తెలిపారు.
నా యూట్యూబ్ ఛానెల్ ఇచ్చేయమని గొడవ జరగడం, ఒక 60 వీడియోలు కూడా వాళ్ళే తీసుకున్నారు, అక్కడి గొడవల వల్లే ఇలా జరిగిందని, గత రెండు నెలలుగా చంపుతాం అంటూ బెదిరిస్తున్నారంటూ లక్ష్మమ్మ తెలిపారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన ఆమె వీడియోలు చేయడం కోసం హైదరాబాద్ వచ్చినట్లు వాళ్లు బెదిరించినప్పటి నుండి బయటికి రావడం లేదని తెలిపింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…