చిరంజీవి నాటి,నేటి హీరోయిన్స్ దాదాపు ఒక 60 మంది తో కలిసి నటించారు. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి అత్యధిక కాలం కొనసాగిన హీరోయిన్స్ ఉన్నారు. మధ్యలో విరమించుకున్న హీరోయిన్స్ ఉన్నారు .అలాగే ఒకటి రెండు చిత్రాలు మాత్రమే చేసిన హీరోయిన్స్ ఉన్నారు. ఆయన మెగా స్టార్ గా ఎదిగాక అనేకమంది హీరోయిన్స్ ఒక్క సినిమాలోనైనా చిరంజీవి తో నటించే అవకాశం వస్తుందా అని ఎదురు చూసేవారు.
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఆయన డాన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. స్వశక్తిని నమ్ముకుని వచ్చిన అతి కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒకరు. ఎలాంటి సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు. అలా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
1987 గీతా ఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘పసివాడి ప్రాణం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు.
1988 జి.వి.నారాయణ రావు అండ్ ఫ్రెండ్స్ నిర్మాణం, రవిరాజాపినిశెట్టి దర్శకత్వంలో ‘యముడికి మొగుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, రాధ హీరో, హీరోయిన్లుగా నటించారు.
1989 గీతాఆర్ట్స్ నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు.
1990 అశ్వినీదత్ నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ” జగదేక వీరుడు అతిలోక సుందరి “చిత్రం విడుదలైంది ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు.
1991 మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు.
1992 దేవి ఫిలిమ్ ప్రొడక్షన్స్ నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఘరానా మొగుడు’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా హీరో, హీరోయిన్లుగా నటించారు.
మెగాస్టార్ నటించిన ఈ ఆరు చిత్రాలు ఒకదాని తర్వాత మరొకటి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాల్లో శ్రీదేవి, విజయశాంతి, రాధ, నగ్మా కి చోటు దక్కగా.. చిరంజీవితో న్యాయం కావాలి చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఈ హీరోయిన్ దాదాపు ఆయనతో 1990 వరకు కొనసాగారు. ఇదే సంవత్సరంలో విడుదలైన “రాజా విక్రమార్క” చిత్రం వరకు చిరంజీవితో అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా రాధిక ఉండేది. కానీ అనూహ్యంగా విజయశాంతి, చిరంజీవితో 1990 తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించడంతో విజయశాంతి మొదటి స్థానంలో నిలవగా రాధిక రెండో స్థానంలో నిలిచారు. అయినా చిరంజీవి 6 ఇండస్ట్రీ హిట్స్ లో రాధికకు చోటు దక్కకపోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…