Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా సినిమాలతో బిజీగా ఉండే చిరంజీవి ఇటీవల సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సీక్వెల్ గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ చిత్రం వస్తే చూడాలని ఉందని తెలిపారు.
ఇక ఈ సీక్వెల్ సినిమాలో మా అబ్బాయి చరణ్ అలాగే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కలిసి నటిస్తే చూడాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. మరి చిరంజీవి కోరికను ఏ దర్శకుడు నెరవేరుస్తారు. అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్..
ఇకపోతే రామ్ చరణ్ జాన్వీ కపూర్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు జరగబోతున్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…