Poonam Kaur: సినీనటి పూనమ్ కౌర్ తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమె పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఈమె సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కంటే కూడా వివాదాస్పద పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.
ఇక ఈమె పోస్ట్ చేస్తే కనుక ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది కూడా అర్థం కాకుండా పోస్టులు పెడుతూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రాలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూనే పవన్ కళ్యాణ్ పట్ల పరోక్షంగా ఈమె చేస్తున్నటువంటి పోస్టులు సంచలనంగా మారాయి. తాజాగా మరోసారి మూడు పెళ్లిళ్లు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
వైసీపీ ప్రభుత్వ సానుభూతి పరుడైన ఓ నెటిజన్… ఆంధ్రప్రదేశ్ లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు చేయాలని ఎలన్ మస్క్ ని రిక్వెస్ట్ చేశాడు. ఇక అతను లండన్ లో డాక్టర్ గా పనిచేయటం విశేషం ఇలా ఈ పోస్ట్ చేయడంతో వెంటనే పూనం ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఆయనకు మూడు పెళ్లిళ్లు అయినా పర్వాలేదా అంటూ కామెంట్ చేశారు. ఎలన్ మస్క్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. వైసీపీ సానుభూతి పరుడిగా నీకు ఓకేనా అంటూ ఈమె చేసిన పోస్ట్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ టార్గెట్..
పవన్ కళ్యాణ్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి వైసిపి నేతలతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించడంతో ఈమె కూడా మూడు పెళ్లిళ్లు అయినా పర్వాలేదా అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూనే ఈ పోస్ట్ చేశారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…