సినిమా ఇండస్ట్రీలో ఓ దర్శకుడు ఒక హీరోను ఊహించుకొని కథను సిద్ధం చేసుకుని చివరికి ఆ సినిమా తీయడం సర్వసాధారణమే. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి. కేవలం హీరోలు మాత్రమే కాకుండా దర్శకనిర్మాతలు కూడా కొన్ని సినిమాలలో మధ్యలో మారుతుంటారు. ఈ విధంగా ఒక హీరో కోసం తయారు చేసుకున్న కథను మరొక హీరో నటించిన సంఘటన మెగా కుటుంబంలో కూడా చోటు చేసుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే….
ప్రేమించుకుందాం రా సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు జయంత్ సి పరాన్‌జి. అప్పట్లో బడా నిర్మాతలు సైతం ఈయన సినిమాల కోసం ముందుగానే ఆఫర్ చేసేవారు. ఇక హీరోల విషయానికి వస్తే ఈ దర్శకుడి కోసం డేట్స్ కూడా ఫిక్స్ చేసుకునేవారు. అంతగా పాపులారిటీని సంపాదించుకున్న జయంత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ కథను సిద్ధం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ కోసం బావగారు బాగున్నారా సినిమా కోసం కథను సిద్ధం చేసుకుని పవన్ కళ్యాణ్ కు వినిపించగా ఈ కథ పవన్ కల్యాణ్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ఉన్నటువంటి కామెడీ ఎమోషనల్ సీన్స్ పవన్ కి నచ్చాయి.అయితే అప్పటికే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తీయాలంటే మరికాస్త సమయం పడుతుందని చెప్పారు.
పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం చేత ఈ సినిమాలో నటించడం కుదరదని ఈ సినిమా తన అన్నయ్య చిరంజీవికి అయితే ఇంకా బాగా సరిపోతుందని స్వయంగా పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు. అయితే ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు నిర్మించడంతో ఎలాంటి సమస్య లేకుండా పోయింది.మెగాస్టార్ కు కథ వినిపించిన డైరెక్టర్ జయంత్ ఈ సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొద్దిగా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అలా పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను మెగాస్టార్ చేసి ఒక విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…