Movie News

సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదం జరిగిందనే సంగతి మీకు తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలను తెరకెక్కించేటప్పుడు కొంత వరకు ప్రమాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఏవైనా కష్టతరమైన సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు హీరో హీరోయిన్లు కాకుండా వారికి డూప్ లను తీసుకొని చిత్రాన్ని తెరకెక్కిస్తారు. అయితే ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ప్రమాదాలు జరగడం కొన్నిసార్లు ఆ ప్రమాదాలలో మరణించడం కూడా జరుగుతుంటాయి.

ఈ క్రమంలోనే ఒకప్పుడు కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి జంటగా నటించినటువంటి చిత్రం అడవి సింహాలు. వైజయంతి బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఒకరోజు షూటింగ్ లో భాగంగా ఈ నలుగురిపై వైజాగ్ బీచ్ లో ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాట చిత్రీకరణ జరిగే సమయంలో అనుకోని ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఒకరు మరణించారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వైజాగ్ బీచ్ లో ఈ నలుగురిపై పిల్ల నచ్చింది అనే పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం వైజాగ్ బీచ్ కి వెళ్లారు.ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి బెలూన్స్ అన్నింటికీ గ్యాస్ నింపుతూ ఉన్నారు.అయితే ఆ వ్యక్తి అలా నింపడంతో కొందరు పిల్లలు అతనిని ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిలబడ్డారు. ఆ సమయంలోనే కృష్ణంరాజు జయప్రద అక్కడికి వెళ్లగా వారి మాటలు విని చాలా మంది అక్కడికి చేరుకున్నారు.

ఈ విధంగా బెలూన్స్ లో గ్యాస్ నింపుతున్న సమయం లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి తల తెగిపడింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు భయంతో వణికిపోయి వెళ్లి ఒక్కసారిగా సినీనటుల దగ్గరికి పారిపోవడంతో పెద్ద పెనుప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేదంటే మరింత ప్రాణనష్టం జరిగేదని ఓ సందర్భంలో ఈ చిత్రంలో జరిగిన ప్రమాదం గురించి బయట పెట్టారు. ఏది ఏమైనప్పటికీ సినిమా సెట్ లో ఇలా జరగడం అప్పట్లో అందరినీ కలిచివేసిందని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago