Movie News

Chiranjeevi: నిహారిక చైతన్య విడాకుల విషయంలో రంగంలోకి దిగిన చిరంజీవి?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ గురించి అందరికీ ఎంతో సుపరిచితమే.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మెగా కుటుంబం గురించి ముఖ్యంగా మెగా ఆడపడుచుల గురించి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది.ఇన్ని రోజులు మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ రెండవ భర్తకు కూడా విడాకులు ఇచ్చిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా శ్రీజ విడాకుల గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ రాకముందే మరో మెగా ఆడపడుచు నిహారిక కూడా విడాకులు తీసుకోబోతుందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ విధంగా నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులకు సిద్ధమయ్యారనే వార్త ఒక్కసారిగా మెగా అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.ఈ క్రమంలోనే జొన్నలగడ్డ వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ లో తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

గత కొద్ది రోజుల క్రితమే నిహారిక చైతన్య విడాకులు విషయం వార్తల్లోకి వచ్చింది. అయితే తాజాగా వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం,పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడమే కాకుండా ఈ మధ్యకాలంలో మెగా కుటుంబంలో జరిగిన ఏ వేడుకకు కూడా వెంకట చైతన్య హాజరు కాకపోవడంతో అనుమానాలు మరింత బలమవుతున్నాయి.

ఇలా మెగా కుటుంబం గురించి ఏ చిన్న వార్తలు వచ్చిన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు ఆ వార్తలపై స్పందించి ఆ వార్తలను పూర్తిగా ఖండిస్తారు. అలాంటిది తన గారాల పట్టి నిహారిక విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ నాగబాబు స్పందించకపోవడం గమనార్హం. ఇలా నిహారిక వెంకట చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రావడంతో వీరి విషయంలోకి మెగా స్టార్ ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది.


Chiranjeevi: నచ్చజెప్పే ప్రయత్నంలో మెగాస్టార్…

ఈ క్రమంలోనే వీరిద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నంలో మెగాస్టార్ ఉన్నట్టు సమాచారం. ఇలా మెగాస్టార్ చిరంజీవి కూడా వీరి విడాకులపై స్పందించి నచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని వార్త కూడా వైరల్ గా మారింది. మరి చిరంజీవి చెప్పిన మాటని హారిక చైతన్య వింటారా లేదంటే విడాకుల వైపే అడుగులు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా నిహారిక వెంకట చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని తెలియడంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago