Movie News

Bhuma Mounika: మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసిన కొత్త కోడలు… ఫోటోలు వైరల్!

Bhuma Mounika: టాలీవుడ్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మార్చి 19వ తేదీ తన 71వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా మోహన్ బాబు 71 వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వేడుకలను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మోహన్ బాబు చిన్న కోడలు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక దగ్గరుండి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరూ గుడికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయించినట్టు తెలుస్తోంది. ఈ పూజ కార్యక్రమాలలో భాగంగా మోహన్ బాబు ఆయన భార్య నిర్మలాదేవి మంచు లక్ష్మి తన కుమార్తె, మౌనిక, మనోజ్ ఉన్నారు. ఇలా మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలలో విష్ణు ఫ్యామిలీ మాత్రం మిస్ అయ్యారు.

Bhuma Mounika: నడక నుంచి నడవడిక వరకు నేర్పించావు…


ఈ ఫోటోలలో మంచు విష్ణు కనిపించకపోవడంతో విష్ణు ఎక్కడ అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇలా వీరందరూ కలిసి దిగిన ఫోటోని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నడక నుంచి నడవడిక వరకు నేర్పించిన నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు…. ఐ లవ్ యు నాన్న అంటూ ఈయన శుభాకాంక్షలు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago