Featured

Chiranjeevi vs NTR : ఎన్టీఆర్ సినిమా వస్తుందని తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్న చిరు..? అవాక్కయిన టాలీవుడ్..!

Chiranjeevi postponed his movie because of NTR : టాలీవుడ్ టాప్ హీరోలు మెగాస్టార్ ఒకరు, అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ సినిమా కూడా రిలీజ్ అవుతుందని తన సినిమాని వాయిదా వేసుకున్న సందర్భం ఉంది. ఈ సందర్భం 19 ఏళ్ల క్రిందట జరిగినది. ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా ఒకే టైం లో వచ్చాయి. అందులోనూ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమా కి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కు దర్శకుడు బి.గోపాల్ కావడం విశేషం. ఇక రెండు సినిమాలోని హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కావడం మరో విశేషం. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మాతలు జూలై 18న ఒకే రోజు విడుదల చేయాలని భావించారట.

చిరంజీవి ఇంద్ర సినిమా వాయిదా వేసుకోవడానికి గల కారణం….

అల్లరి రాముడు సినిమా విడుదల మందు ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా ఆది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కు ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అప్పుడు ఆ సినిమా విజయంతో ఎన్టీఆర్ మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ చిరంజీవి ‘మృగరాజు’, ‘శ్రీ మంజునాథ’,‘డాడీ’వంటి వరుస పరాజయాలతో నిరాశ లో వున్నారు. ఈ వరుస సినిమాల పరాజయం వళ్ళ చిరంజీవి అంత ఫామ్ లో లేరు.

ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా చిరంజీవి ఇంద్ర సినిమాలు రెండు ఒకే రోజు విడుదల చేయాలని నిర్మాతలు భావించడంతో చిరంజీవి కాస్త వెనకడుగు వేశారట. అల్లరి రాముడు సినిమా హిట్ అయి చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే చిరంజీవి ఇమేజ్ మీద దెబ్బ పడుతుంది అని ఇండస్ట్రీ లో టాక్ కూడా నడిచిందట. పైగా చిరంజీవి ఇంద్ర సినిమా కి రన్ టైం ఇష్యూస్ కూడా ఉండటంతో, ఇంద్ర సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేసి జూలై 24 న విడుదల చేశారట. అయితే మొదట విడుదలైన అల్లరి రాముడు సినిమా మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఎన్టీఆర్ ఇమేజ్ వల్ల మాత్రమే ఆ సినిమాకు ఓపెనింగ్స్ దక్కాయి. ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒకవేళ అదే టైంలో ఇంద్ర సినిమా విడుదల అవ్వకపోయివుంటే అల్లరి రాముడు సినిమా అవేరేజ్ టాక్ ఐనా తెచ్చుకునేది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago