Simbu bullet song promo was released : ప్రస్తుతం పోతినేని రామ్ హీరోగా ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. సింగం సిరీస్ ల దర్శకుడు లింగుస్వామి మొదటిసారి రామ్ కాంబినేషన్ లో ఈ సినిమా రానుండటంతో దీని మీద అంచనాలు పెరిగాయి. పోతినేని రామ్ కూడా ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా ఉప్పెన సినిమా తో అందరినీ ఆకట్టుకున్న కృతి శెట్టి నటిస్తోంది.
ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి సినిమాల తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న ది వారియర్ సినిమాలో మొదటిసారి రామ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. లింగస్వామి హీరోని పోలీస్ అధికారి గా చూపించడంలో ఎంత దిట్ట నో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం అప్పుడే మొదలు పెట్టేసారు.
శింబు పాడిన బుల్లెట్ సాంగ్ ప్రోమో విడుదల….
తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో శింబు తన గొంతు సవరించుకున్నాడు అన్న సంగతి తెలిసిందే. శంభు ఈ సినిమా కోసం తమిళ్ తెలుగు రెండు భాషల్లోనూ ఒక పాట పాడాడు. ఇటీవలనే సింధు ది వారియర్ సినిమా కోసం బుల్లెట్ సాంగ్ అనే పాటలు పాడుతున్నారు అని చిత్రబృందం తెలియజేశారు. ఇక తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. మంచి మాస్ బీట్ తో ఈ పాట ఉండబోతోంది అని ప్రమోతోనే అర్థం ఐపోతోంది.
ఇక ఈ ప్రోమోలో రామ్ ఇంకా కృతి శెట్టి స్టెప్పులతో అదరగొట్టారు.దేవి శ్రీ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటింది.ఈ పాటకి సంబంధించిన పూర్తి లిరికల్ వీడియో ఈనెల 22వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు శ్రీమణి సంగీతం అందించారు. ఇక శింబు రామ్ సినిమాలో తాను పాట పాడినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…