Featured

Swayamkrushi : ఈ సినిమా చూసిన తరువాత చాలామంది తమ చెప్పుల షాప్ కి “స్వయంకృషి” అని పేరు పెట్టుకున్నారు.!!

Swayamkrushi : కళాతపస్వి కె.విశ్వనాథ్ “సిరిసిరిమువ్వ” నుంచి మొదలుకొని తన సినీ గమనాన్ని కొత్త పంథాలో తీసుకువెళ్లారు. కమర్షియల్ హంగులతో వచ్చిన సినిమాలకే ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు అనే విధానం నుంచి నిజ జీవితం లో జరిగే సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తే అంగీకరిస్తారని కె. విశ్వనాథ్ తన చిత్రాలతో నిరూపించారు. అలా కె.విశ్వనాథ్ – చిరంజీవి‌ కలయిక “శుభలేఖ” చిత్రంతో మొదలైంది. ఇక వీరి కాంబినేషన్ లో రెండవ చిత్రం గా స్వయంకృషి రూపుదిద్దుకుంది.

1987 ఏడిదనాగేశ్వరరావు నిర్మాణం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “స్వయంకృషి” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. బాల నటుడు మాస్టర్ అర్జున్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు. సంక్షిప్తంగా కథలోకి వెళితే…

శ్రమలోని ఔన్నత్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. సున్నితమైన పాత్రలో చిరంజీవి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందింది. కథలో ఇమిడేలాగా ప్రేమ పాటలు, ఫైట్లు కూడా చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి.
సాంబయ్య (చిరంజీవి) అనే చెప్పులు కుట్టుకొనే, చదువురాని వ్యక్తి కష్టపడి పైకొచ్చి పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. తన కృషిలో సహచరిణి అయిన గంగ (విజయశాంతి)ని పెళ్ళి చేసుకొంటాడు. శారద (సుమలత) అనే అమ్మాయిని చదివించి ప్రయోజకురాలిని చేస్తాడు. చనిపోయిన తన చెల్లెలు కొడుకు చిన్నా (అర్జున్ / శిరీష్)ను తన స్వంత కొడుకులా పెంచుతాడు. చిన్నా పెంపకానికి అడ్డు రాకూడదని గంగ తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొంటుంది. చదువు విలువ తెలిసిన సాంబయ్య గంగను చదువుకోమని బలవంతం చేస్తుంటాడు.

తరువాత కథలో కొన్ని మలుపులు తిరుగుతాయి. ధనిక జీవితానికి అలవాటు పడిన చిన్నా తనకు చెప్పులు తుడుచుకోవడం, స్కూల్ బ్యాగ్ మోయడం వంటి కాయకష్టపు పనులంటే అసహ్యమని మొరాయిస్తుంటాడు. చిన్నాకు జన్మనిచ్చిన తండ్రి గోవింద్ (చరణ్ రాజ్), శారద భర్త (బెనర్జీ) కలిసి సాంబయ్య ఇంటిలో కలతలు సృష్టించి అతని ఆస్తిని కాజేయడానికి, అతనిపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తారు. చివరికి చిన్నాను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తాన్ని చిన్నా పేరుమీద వ్రాసి (ప్రత్యర్ధులకు అప్పగించి) సాంబయ్య, గంగ మళ్ళీ చెట్టుకింద చెప్పులు కుట్టుకొనే వృత్తి చేపడతారు. తన తప్పు తెలుసుకొన్న చిన్నా ఆ ఎదురు చెట్టు క్రింద చెప్పులు కుట్టడానికి గుడ్డ పరచుకొంటాడు.. శుభం పడడంతో సినిమా ముగుస్తుంది.

ఖైదీ, కొండవీటి రాజా, అడవిదొంగ పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ తో నెంబర్ వన్ పొజిషన్ కి ఎదుగుతున్న చిరంజీవి పూర్తిగా తన కమర్షియల్ చట్రంలో నుంచి బయటకు వచ్చి చేసిన చిత్రం స్వయంకృషి. కళాతపస్వి రూపొందించిన “స్వాతిముత్యం” చూసిన చిరంజీవి దాదాపు వారం రోజుల పాటు ఆ సినిమాని మర్చిపోలేక పోయారు. ముఖ్యంగా అందులో మానసిక పరిపక్వత లేని పాత్రలో కమల్ హాసన్ నటన అత్యంత సహజసిద్ధంగా ఉండడం చిరంజీవిని విస్మయానికి గురి చేసింది. తిరిగి విశ్వనాధ్ దర్శకత్వంలో నటించాలని ఉందని చెప్పడంతో స్వయంకృషి చిత్రం రూపొందించారు.

1987 సెప్టెంబర్ 3న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఐతే‌ ఈ సినిమాలో చెప్పులు కుట్టేవానిచే శిక్షణ పొంది చిరంజీవి స్వయంగా చెప్పులు కుడుతూ నటించడం ఈ సినిమాకి మరింత వన్నె తెచ్చింది. ఈ చిత్రంలోని చిరంజీవి ఉత్తమ నటనకు నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు వారి యొక్క చెప్పుల దుకాణానికి “స్వయంకృషి” అని పేరు పెట్టుకోవడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago