Rajamouli directed serial : పరాజయం ఎరుగని దర్శకుడిగా ముద్ర వేసుకున్న రాజమౌళి తన ప్రయాణంలో అంత ఈజీగా సక్సెస్ అవ్వలేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలకు అన్ని రంగాలలో పని చేసి తన ప్రతిభతో రాఘవేంద్రరావుని ఆశ్చర్యపరిచి ఆయన పర్యవేక్షణలో ఒక సీరియల్ ను తోలుత డైరెక్టర్ చేసారు. ఈటీవీలో అప్పట్లో సంచలనం సృష్టించిన శాంతినివాసం అనే సీరియల్ కు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాను తీశారు. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు గారి మీద అభిమానంతో ఆయన పర్యవేక్షణలో అని వేసుకున్నారు.ఈ సినిమా ఎన్టీఆర్ కు రెండో సినిమా ఇక ఈ సినిమాతో రాజమౌళి మొదటి హిట్ కొట్టారు.
ఇక ఆ తరువాత రాజమౌళి విజయ పరంపర ఆగలేదు. సింహాద్రి, సై, ఛత్రపతి,యమదొంగ నుండి నేటి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలు దేనికవే ప్రత్యేకం అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ చిత్రాలే. జక్కన్న సినిమాలో హీరో కంటే జక్కన్న సినిమాను చూపించే విధానమే సినిమాను హిట్ చేస్తుంది. అందుకే విక్రమార్కుడు, ఛత్రపతి అంటూ తీసిన ఈగ అంటూ తీసిన అన్ని హిట్ సినిమాలే ఇక సునీల్ ను హీరోగా పెట్టి తీసిన మర్యాద రామన్న సినిమా సింపుల్ కథే అయిన సినిమా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా రాజమౌళి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ .
ఇక సింహాద్రి సినిమాతో టాలీవుడ్ కి తన గురించి తెలిసేలా చేసిన జక్కన్న బాహుబలి సినిమాతో బాలీవుడ్ కి తానేంటో చూపించాడు. బాహుబలి రెండు పార్టులు, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే ముద్ర చేరిపేసి టాలీవుడ్ వైపు చూసేలా చేసాడు. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేసాడు. ఇక ఇండియా లో నెంబర్ 1 దర్శకుడు రాజమౌళినే అంటే అది అతిశయోక్తి కాదేమో.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…