Prashanth neel shared memories with Punith Raj Kumar : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో కన్నడ చిత్రసీమ మాత్రమే కాకుండా ఇండియా మొత్తం దిగ్బ్రాంతికి లోనైంది. అంతవరకు ఆయనకు కర్ణాటక లో అభిమానులు ఉన్నారని అందరు అనుకున్నారు. కానీ ఆయన మరణించాకే ఎంత మంది ఇండియాలో అభిమానులున్నారో అర్థమైంది.అయినా సినిమాలతో ఎంత గుర్తింపు పొందారో అంతకన్నా సమాజ సేవతో అందరి గుండెల్లో నిలిచారు.
ఆయన మరణించినపుడు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమ నుండే కాదు తెలుగు హీరోలు కూడా ఆయనను కడసారి చూడడానికి వచ్చారు. ఇక ఆయనతో ఉన్న జ్ఞాపకాలను చాలా మంది ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. ఇక కేజీఎఫ్ ఫ్రాంచైస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి ఆయన జ్ఞాపకాలను ఇటీవల పంచుకున్నారు.
అప్పు సార్ అంటే మొదట్లో కోపం….
క్రికెట్ అంటే చాలా ఇష్టమైన ప్రశాంత్ హోటల్ ప్రదేశాల్లో క్రికెట్ ఆడేవారట స్నేహితులతో.ఇక అలానే ఒకసారి ఒక హోటల్లో స్నేహితులతో క్రికెట్ ఆడాలని ప్లాన్ చేసుకున్నాక చివరి నిమిషంలో ఆట ఆడనివ్వలేదట హోటల్ యాజమాన్యం పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు షూటింగ్ ఉండటమే అందుకు కారణమట. దీంతో ప్రశాంత్ కు పునీత్ పై బాగా కోపం వచ్చిందట. అయితే అప్పు సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత తన సన్నిహితుల బలవంతం మీద అప్పు సినిమా చుసాడట ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఆయన నటనకు ఫిదా అయ్యారంట ప్రశాంత్.
ఇక ఉగ్రమ్ సినిమా విజయం తర్వాత కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ జోడి చేసి ఒక సినిమా పునీత్ గారితో తీయాలనీ భావించారట ప్రశాంత్ ఇక స్టోరీ సిద్ధం చేసి పునీత్ కు వినిపించగా ఆయన కూడా ఒక అన్నారట. ఇక ఆహ్వాన అనే పేరును కూడా సినిమాకు రిజిస్టర్ చేశారట. కానీ అంతలో కేజీఎఫ్ తో బిజీ ఆవడం కరోనా లాక్ డౌన్ ఇక ఆ తరువాత పునీత్ అకాల మరణం వల్ల ఆయనతో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయానని తనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…