Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే.ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనంతరం తాను సంపాదించిన దానిలో కొంత భాగం సమాజసేవ కోసం ఉపయోగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.
ఈ విధంగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఎప్పటికప్పుడు చిరంజీవి పట్ల తమకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటి చెబుతుంటారు.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాను నటించబోయే తదుపరి చిత్రం వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయన లుక్ ప్రేక్షకులను అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే మల్లారెడ్డి కాలేజీకి చెందినటువంటి 6000 మంది విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి గెటప్ లో ఉన్నారో అలాంటి ముఖచిత్రంగా ఏర్పడి మెగాస్టార్ చిరంజీవి పై తమకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజీలో.. ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘కిల్ క్యాన్సర్’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ క్రమంలోని విద్యార్థులంతా కలిసి చిరంజీవి ముఖచిత్రంగా ఏర్పడుతూ ఆయన పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబి ఈ వీడియోని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…