MS. Vikram : తెలుగులో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన నటించిన అనేక సినిమాల్లో పండించిన హాస్యానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 750 సినిమాల్లో నటించిన ఎంఎస్ గారు ‘పెదరాయుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కొడుకు విక్రమ్ నారాయణ కూడా సినిమాల మీద ఆసక్తి తో సినిమాల్లోకి వచ్చేసి ‘కొడుకు’ సినిమాతో హీరో అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. ఇక తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమ గురించి అలాగే తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తి గురించి మాట్లాడారు.
తరుణ్, అబ్బాస్ ల కెరీర్ అలా అవడానికి కారణం అదే…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే బ్యాక్ గ్రౌండ్ తో పాటు లక్ ఫ్యాక్టర్ ఉండాలంటూ చెప్పారు. టైం కలిసి వస్తేనే ఎదుగుతారు అంటూ చెప్పారు. సినిమాల్లోకి రావాలనుకునే ఏ ఆర్టిస్ట్ కైనా టాలెంట్ ఉండే వస్తారు. టాలెంట్ లేకుండా ఇండస్ట్రీకి రారు, కానీ అందరూ సినిమాల్లో రాణించలేరు. టాలెంట్ తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి అంటూ చెప్పారు. చిన్నప్పటి నుండి సినిమాల్లో సీరియల్స్ లో నటించిన తరుణ్ కి ఎంతో టాలెంట్ ఉన్నా ప్రస్తుతం కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది.
ఎవరికైనా టైం రావాలి అంతే టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు అవకాశాలు రావు అంతే. హీరో అబ్బాస్ ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఆ తరువాత సినిమాల్లో ముందుకు పోలేకపోయారు. ఇక్కడ సినిమా పరిశ్రమలో ఎవరికి ఎపుడు దశ ఎలా తిరుగుతుందో తెలియదు. నాకు ఏదో ఒక రోజు అవకాశం రావొచ్చు, నేను ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నా కానీ సినిమా మీద ఇష్టం పోలేదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…