Featured

Chiranjeevi vs Mohan Babu : బాక్సాఫీస్ వద్ద పడగెత్తిన ఈ పాముల్లో ఏది బుస కొట్టిందో మీకు తెలుసా.?!

సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో ఈ ఇద్దరు హీరోలు కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో నటించారు. ఆ తర్వాత తమను తాము నిరూపించుకుని హీరోగా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.. కాకతాళీయంగా ఈ ఇద్దరు కూడా “నాగు” అనే టైటిల్ సినిమాలో నటించారు.

మొదటగా మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే… “పున్నమినాగు” ఎం.రాజశేఖర్ దర్శకత్వంలో 1980లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, నరసింహ రాజు, రతిఅగ్ని హోత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం.కుమరన్, ఎం.శరవణన్, ఎం. బాలసుబ్రమణియం కలిసి ఎవియం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

నాగులు ఒక పాములు ఆడించుకునే వ్యక్తి. పూర్ణిమ అనే యువతిని ప్రేమిస్తాడు. మేనక పెంపుడు అన్న రాజు నాగులు చెల్లెలు వరసైన లక్ష్మిని ప్రేమిస్తుంటాడు. నాగులు(చిరంజీవి) తండ్రి చిన్నప్పటి నుంచి అతనికి కొంచెం కొంచెం పాము విషం అతని తినే తిండిలో కలిపి ఇస్తుంటాడు. దీనివల్ల అతనికి పాము కరిచినా ఏమీ కాకుండా ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ అతను ఒక కన్యను వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అతనికి కలిసిన అమ్మాయిలందరూ అతనిలో ఉన్న విషానికి బలవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక సారి పూర్ణిమ కూడా అలాగే మరణిస్తుంది. చనిపోయిన పూర్ణిమ ఒంటి మీద ఎక్కడా పాము కాటు గుర్తులు లేకపోవడంతో రాజుకు(నరసింహ రాజు) నాగులు మీద అనుమానం మొదలవుతుంది.

ఒక యువతి ఆ ఊరికి టీచర్ గా వచ్చి నాగులు చేతిలో మరణిస్తుంది. రాజు ఆమె చేతిలో ఉన్న కెమెరాను చూసి నాగులు పాములా మారిపోయినట్లు గమనిస్తాడు. నాగులు తండ్రి చనిపోబోయే ముందు ఆ రహస్యాన్ని నాగులుకి వెల్లడిస్తాడు. నాగులు దానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయి ఉంటుంది. అతని చర్మం పాము కుబుసం లాగా కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు రాకముందే అక్కడి నుంచి పారిపొమ్మని అతనికి రాజు సలహా ఇస్తాడు. కానీ నాగులు తనకు పాములాగా బతకడం కన్నా మరణమే శరణ్యమని కొండమీద నుంచి దూకి మరణిస్తాడు.

1986 సావాతి చిత్ర కంబైన్స్, ఎమ్మెస్ కోటారెడ్డి దర్శకత్వంలో “నాంపల్లినాగు”చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, సుమలత, సువర్ణ హీరో, హీరోయిన్లుగా నటించగా.. జయమాలిని ప్రధాన పాత్రలో కనిపిస్తారు. నాగుపాము నేపథ్యంగా ఈ సినిమా కథ ఉండకపోయినా.. కథానాయకుడు మోహన్ బాబు “నాంపల్లినాగు” అనే పేరుతో కొనసాగుతాడు. రౌడీ షేడ్స్ లో కనిపించే హీరోగా మోహన్ బాబు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ సినిమాలో కథా బలం లేకపోవడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందగా…

చిరంజీవి నటించిన “పున్నమినాగు” చిత్రకథ కొత్తగా ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ లో కనిపించినప్పటికీ ఈ చిత్రం మొత్తం చిరంజీవి పాత్రతో ముందుకు సాగుతుంది. చక్రవర్తి స్వరపరిచిన “పున్నమిరాత్రి పువ్వుల రాత్రి”… అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది.చిరంజీవి నాగుపాము లా తనదైన నటనను కనబరిచారు. కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

1 hour ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

1 hour ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

1 hour ago

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

9 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago