Featured

మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి అగ్ర హీరోలైనా కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి లకు ఓ ఫ్లాప్ సినిమా కూడా ఇచ్చారని తెలుసా.?!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు బప్పిలహరి ఎన్నో తెలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1986లో ప్రముఖ హీరో కృష్ణ తమ సొంత బ్యానర్ పద్మాలయా స్టూడియోస్ లో ఒక చిత్రాన్ని రూపొందించాలననుకున్నారు. ఆ క్రమంలో ఆయన సింహాసనం సినిమాకి దర్శకత్వం కూడా చేశారు. ఇది ఒక జానపద చిత్రం కావడంతో సంగీతం కూడా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో బాలీవుడ్ నుంచి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరిని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.

అలా1986, పద్మాలయా స్టూడియోస్, కృష్ణ దర్శకత్వంలో “సింహాసనం” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో కృష్ణ, జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి బప్పీలహరి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. “ఆకాశంలో ఒక తార.. నాకోసం వచ్చింది ఈవేళ..” అనే పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సింహాసనం చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మరొక చిత్రం కూడా రూపొందించబడింది.

“ఇంద్రభవనం” 1991, మే 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మాలయ మూవీస్ పతాకంపై జి. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, మీనా, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, జ్యోతి తదితరులు నటించగా, బప్పీలహరి సంగీతం అందించాడు. 1990లో హిందీలో వచ్చిన “స్వర్గ్” సినిమాకి రిమేక్ సినిమా ఇది. ఈ చిత్రంలో కృష్ణ నమ్మకమైన సేవకుడి పాత్రను, యజమాని పాత్రను కృష్ణంరాజు పోషించాడు. కొంతమంది బంధువులు, వ్యాపార విరోధుల చేసిన కొన్ని సంఘటనల వల్ల కృష్ణని బయటకు పంపిస్తాడు. అదే సమయంలో కృష్ణంరాజు జీవితంలో, వృత్తిలో చాలా నష్టపాతాడు. కృష్ణ తిరిగొచ్చి తన యజమానిని పూర్వస్థితికి ఎలా తీసుకొచ్చాడన్నది మిగతా కథ. ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రముఖ గాయకుడు మనో మరియు బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ ఆలపించడం జరిగింది. చిక్కాలి, చిక్కాలి అనే గీతం మినహా మిగతా పాటలన్నీ ప్రేక్షకులను రంజింప చేయలేకపోయాయి…

1992, త్రివిక్రమరావు నిర్మాణం బి.గోపాల్ దర్శకత్వంలో “రౌడీ ఇన్స్పెక్టర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో బాలకృష్ణ -బప్పీలహరి కాంబినేషన్ మొదటిసారిగా వెండితెరపై కనిపించింది. ఇందులోని.. డిక్కీ డిక్కీ ఢీడిక్కీ డప్పులు వాయిస్తే లక్కీ.. లాంటి పాటలు ప్రేక్షకాదరణ పొంది సినిమా ఘన విజయానికి కారణమయ్యాయి.

ఆ తర్వాత యువరత్న ఆర్ట్ క్రియేషన్స్,శ్రీనివాస ప్రసాద్ నిర్మాణం,ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “నిప్పురవ్వ” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. విశేషమేమంటే ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్, బప్పిలహరి, రాజ్ కోటి సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో సింగరేణి కార్మికుల నేపథ్యంలో కొనసాగింది. బప్పీలహరి స్వరపరిచిన.. “రావయ్యా రావయ్య ఓ కొంటె కామయ్య’…” కాముడీ పట్నం చూసోద్దాం.. లాంటి సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పొందింది. బాలకృష్ణతో కూడా రౌడీ ఇన్స్పెక్టర్ తో హిట్టు నిప్పురవ్వ సినిమాతో ఓ ఫ్లాప్ ను బప్పిలహరి ఇచ్చారు.

ఇకపోతే మరో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి బప్పీలహరి కాంబినేషన్ “గ్యాంగ్ లీడర్” చిత్రంతో కుదిరింది. 1991, శ్యాం ప్రసాద్ ఆర్ట్స్,విజయబాపినీడు దర్శకత్వంలో “గ్యాంగ్ లీడర్” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు ఆయన రూపొందించిన సినిమాల్లో ఎక్కువగా చిరంజీవితో తీయడం గమనార్హం. ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి స్వరపరిచిన “భద్రాచలం కొండ.. సీతమ్మ వారి దండ” అనే గీతం ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. మిగతా పాటలు వినసొంపుగా ఉన్నాయి. గ్యాంగ్ లీడర్ చిత్రం ఆ సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తరువాత కొద్ది సంవత్సరాలకే వీరి కాంబినేషన్ లో మరొక చిత్రం రూపొందించబడింది.

1995, శ్యాం ప్రసాద్ ఆర్ట్స్, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో “బిగ్ బాస్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి రోజా హీరో, హీరోయిన్లుగా నటించారు. మాధవి, విజయ్ చందర్, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో కనిపించారు. బప్పి లహరి అందించిన గీతాలలో “మావ మావ.. ఏమె ఏమె భామ.. అనే గీతం మినహా మిగతా పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. కట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ విధంగా కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోలకు హిట్టుతో పాటుగా ఓ ఫ్లాప్ ను కూడా మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి అందించడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

7 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

1 day ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

1 day ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

1 day ago