Featured

RRR Movie: ఆర్ఆర్ఆర్ కలెక్షన్లలో పావువంతు కూడా లేవు.. నోటి దూల మాత్రం ఎక్కువ!

RRR Movie: ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పలు చిత్రాల్లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఎంత పెరున్నా, ఒక్కోసారి నోరు అదుపులో పెట్టుకోకపోతే, భంగ పడాల్సిందే అంటున్నారు నెటిజన్లు. అసలు ఏం జరిగింది? అందుకు అంతలా అతన్ని ట్రోల్ చేస్తున్నారు అన్న విషయానికొస్తే, ఇటీవల అయన నటించిన ఎటాక్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, జాన్ సౌత్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

RRR Movie: ఆర్ఆర్ఆర్ కలెక్షన్లలో పావువంతు కూడా లేవు.. నోటి దూల మాత్రం ఎక్కువ!

కాగా ఇటీవలే ఆ సినిమా రిలీజ్ కావడంతో, అతను అన్న కామెంట్స్ పై ప్రేక్షకులు తెగ మండి పడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు భయపడి బాలీవుడ్ లో చాలా మంది తమ సినిమా రిలీజ్ ను ఆపుకున్నాయని, దేశంలో బాలీవుడ్ సినిమాలే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయని ఆయన ఒకప్పుడు అన్న విషయం తెలిసిందే.

RRR Movie: ఆర్ఆర్ఆర్ కలెక్షన్లలో పావువంతు కూడా లేవు.. నోటి దూల మాత్రం ఎక్కువ!

అంతే కాకుండా తాను హిందీ హీరోని అని, కాబట్టి హిందీలో తీసే చిత్రాల్లో మాత్రమే నటిస్తానని, రెమ్యునరేషన్ కోసమో, ఇంకా దేని కోసమో తాను సౌత్ సినిమాల్లో నటించనని ఆయన చెప్పారు. అయితే అప్పట్లో అతను చేసిన వ్యాఖ్యలు ఎవరూ అంత పట్టించుకోక పోయినా, ఇప్పుడు ఎటాక్ సినిమా రిలీజ్ కావడంతో ఆయన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

నోటి దూల ఎక్కువ…

ఇక విషయానికొస్తే ఏ సినిమాని ఐతే జాన్ అబ్రహం విమర్శించారో, ఇప్పుడు ఆ సినిమానే రోజుకో ట్రెండ్ ను సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్ల వసూళ్లతో దూసుకు పోతూ ప్రపంచ వ్యాప్తంగా సునామీ సృష్టిస్తోంది. ఇక ఎటాక్ మూవీ విషయానికొస్తే, తాజాగా విడుదల అయిన ఈ చిత్రం తొలిరోజు రూ.3 కోట్లు వసూలు చేయగా, ఆర్ ఆర్ ఆర్ మాత్రం మొదటి రోజే రూ.20 కోట్లు అంటే, సగం కూడా ఎటాక్ సినిమా, ఆర్ ఆర్ ఆర్ ను రీచ్ కాలేకపోయింది. అంతే కాదు ఫస్ట్ వీక్ లో బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రూ.130 కోట్లను వసూలు చేసి ట్రెండ్ ను సెట్ చేసింది. దీంతో అప్పుడు జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలను, ఈ సినిమాకు ఆపాదిస్తూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లలో పావు వంతు కూడా లేకపోయినప్పటికీ నోటి దూల మాత్రమే ఎక్కువగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

19 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

19 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

19 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

20 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

20 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

20 hours ago