Oscar will Smith issue : ఆస్కార్ వేడుకలు అనగానే ఏ సినిమాకు అవార్డులు వచ్చాయి ఏ నటి నటులకు అవార్డులు వచ్చాయని వార్తలు హోరేత్తుతాయి. కాని ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఒక సంఘటన బాగా వైరల్ అయింది. అదే క్రిస్ రాక్ పై విల్ స్మిత్ దాడి. తన భార్య పై జోకులు వేసినందుకు విల్ స్మిత్ క్రిస్ ను చెంప దెబ్బ కొట్టారు. ఆస్కార్ వేదికపై ఇలా జరగడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆస్కార్ అకాడమీ క్రమశిక్షణ చర్యలు :
ఇక ఈ సంఘటనకు సంబంధించి ఆస్కార్ అకాడమీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధపడింది. విల్ స్మిత్ ను వెంటనే ఆ వేదిక పై నుండి వెళ్లిపోవాల్సిందిగా చెప్పారు. ఇక ఆయన ను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆస్కార్ షో నిర్మాత విల్ ప్యాకర్ పేర్కొన్నారు.లాస్ ఏంజెల్స్ పోలీసులు స్మిత్ ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న రాక్ అందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడటం లేదని స్థానిక మీడియా చెబుతోంది.
క్షమాపణలు చెప్పిన స్మిత్….
ఇక విల్ స్మిత్ ఈ సంఘటన తర్వాత సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో రాక్ పై దాడి చేసినందుకు క్షమాపణలు కోరారు. అందులో అతను తన ప్రవర్తనను “ఆమోదించలేనిది, క్షమించరానిది” అని పేర్కొన్నారు. “నేను మీకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను, క్రిస్. నేను తప్పు చేశాను. నా చర్యలకు సిగ్గుపడుతున్నాను.” అని రాశారు. ఇక పోతే విల్ స్మిత్ ఆస్కార్ గెలుచుకున్న ఐదవ నల్లజాతీయుడు కావడం విశేషం.
అకాడమీ ప్రవర్తనా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు విల్ స్మిత్‌పై బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ క్రమశిక్షణా చర్యలను ప్రారంభించిందని ప్రకటనలో తెలిపింది . సస్పెన్షన్, బహిష్కరణ లేదా ఇతర ఆంక్షలు లాంటి క్రమశిక్షణ చర్యలు అకాడమీ తీసుకుంటుందని భావించారు ఈ నేపధ్యంలో విల్ స్మిత్ తో రాజీనామా చేయించింది అకాడమీ.. ఇలా ఆస్కార్ వచ్చిన ఆనందం కంటే చెంప దెబ్బ ఎక్కువ చేటు చేసింది స్మిత్ కు….
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…