Featured

Choreographer Amma Rajashekhar : ప్రభాస్ ముఖం ఇప్పటికీ చూడలేదు… ఒక సాంగ్ కి 8 లక్షల రెమ్యూనరేషన్… నా కెరీర్ నాశనం అవడానికి కారణం అదే…: కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్

Choreographer Amma Rajashekhar : డాన్స్ మాస్టర్ గా అడుగుపెట్టి దర్శకులుగా మారి సినిమాలు చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్ ఇద్దరూ డైరెక్టర్లుగా సక్సెస్ అయ్యారు. అటు డాన్స్ కోరియోగ్రాఫర్లుగా మంచి స్టేజి లో ఉంటూనే ఇటు దర్శకులుగా హిట్లు కొడుతున్నారు. వీరి లాగానే డాన్స్ మాస్టర్ నుండి దర్శకుడిగా మారిన మరో వ్యక్తి అమ్మ రాజశేఖర్. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు ఉన్న అమ్మ రాజశేఖర్ ఆ తరువాత దర్శకుడిగా మారాడు.

ప్రభాస్ ముఖం ఇప్పటికీ చూడలేదు…

తమిళ సినిమాలతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడు అమ్మ రాజశేఖర్. ఇటు తెలుగులో గోపీచంద్ హీరోగా రణం సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇక ఆసినిమా హిట్ అవ్వడంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకున్నాడు. ప్రభాస్ నుండి పిలుపు రావడంతో కథ చెప్పడానికి వెళ్లాల్సి ఉండగా వేరే కారణాల వల్ల రెండు రోజులు లేట్ అయింది. ఇంక మళ్ళీ వెళితే ప్రభాస్ బిజీగా ఉన్నాడని కలవడం కుదరదని చెప్పడంతో నేను అక్కడే ఎదురుచూసి ఉండవచ్చు కానీ అదే సమయంలో నితిన్ ఫోన్ చేసి ఒక పాటకు డాన్స్ మాస్టర్ గా కావాలని అడిగాడు. ఇక ప్రభాస్ బిజీగా ఉన్నానని చెప్పించడం వల్ల నేను నితిన్ తో సినిమా చేయాలని అనుకున్నాను. అంతా ఓకే అనుకున్నాక కథ తేడా అనిపించి మారుద్దామని అనుకున్న సమయంలో మచ్చా రవి నా దగ్గర స్క్రిప్ట్ కి పనిచేసే వాడు అతను కథ వినిపించి ప్రొడ్యూసర్స్ తో ఓకే చేయించుకోవడంతో నాకు ఇగో హర్ట్ అయింది.

నితిన్ తో చేయాలని ఫిక్స్ అయి తమిళ డిజాస్టర్ మూవీని రీమేక్ చేయాల్సి వచ్చింది, అదే టక్కరి సినిమా. అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు. కానీ చేశా, దానివల్ల నా కెరీర్ నాశనం అయింది. ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసుంటే నా కెరీర్ బాగుండేది నితిన్ లాంటి హీరోతో చేయడం వల్ల ఇక ఆ సినిమా ప్లాప్ అవ్వడం వల్ల నా కెరీర్ పోయింది. ఇక నితిన్ కి అది మంచి సినిమానే అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు. అప్పుడు నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఇప్పుడు నా గురించి ఒక మాట కుడా మాట్లాడడు అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఒకప్పుడు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తే 5 లక్షలు తీసుకునే వారు కానీ నా కెరీర్ పీక్స్ లో నేను 8 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నాను. కానీ చెజేతులా నా కెరీర్ నేనే నాశనం చేసుకున్నాను అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago