Cine Critic Dasari Vignan : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా పృథ్వీ రాజ్ ఒక వెబ్ సిరీస్ లో నటించారు. అందులో పరోక్షంగా జగన్ సర్కారు మీద పంచులు వేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి వీటి గురించి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ విశ్లేషించారు.
ఒరేయ్ జగనూ నీకు మానవత్వం లేదా…
‘ఎటిఎం’ అనే వెబ్ సిరీస్ లో పృథ్వీ రాజ్ నటించారు. అందుకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అందులో జగన్ సర్కారుపై పరోక్షంగా సటైర్లు వేశారు. దీని గురించి దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ ఈ మధ్య పాలిటిక్స్ మీద పరోక్షంగా సటైర్లు వేయడం కామన్ అయిపోయింది. సంక్రాంతి కి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాలో కూడా జగన్ సర్కారు మీద సటైర్లు వేసాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు కమెడియన్ పృథ్వీ వైసీపీ నుండి బయటికి వచ్చాక ఆ పార్టీ లో ఉన్నపుడు తాను విమర్శించిన అందరికీ క్షమాపణలో చెప్పి వైసీపీ వాళ్ళను విమర్శిస్తున్నాడు. అలా ఒక ఛానెల్ లో కూడా పనిచేస్తూ ప్రభుత్వం మీద పంచులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా అవకాశం ఉపయోగించుకున్నాడు. అందులో కార్పొరేటర్ అవ్వాలనుకునే పృథ్వీ జగన్ పేరు గల హీరో దగ్గర పదివి ఇస్తానన్న హామీ తీసుకుని ఉంటాడు. చివరికి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అతడిని కేసులో ఇరికిస్తాడు జగన్, ఆ సందర్భంలో ఒరేయ్ జగనూ నీకు మానవత్వం ఉందా అనే డైలాగని వాడారు. నిజానికి ఈ డైలాగు వినగానే అది పొలిటికల్ అని అర్థమవుతుంది అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తాజాగా విడుదల అయిన వీర సింహా రెడ్డి సినిమాకు బాగా అడ్డంకులు సృష్టించింది. థియేటర్లను తగ్గించి, టికెట్ రేట్స్ తగ్గించి బాగా ఇబ్బంది పెట్టారు.
థియేటర్స్ కూడా బాగున్నావి ఇవ్వకుండా కొంచం బాగోలేనివి ఇవ్వడం వల్ల మాస్ ఆడియన్స్ వెళ్లిపోయారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లడం లేదు అలా సినిమా మీద కక్ష్య తీర్చుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు పేర్ని నాని బంధువు కావడం వల్ల సినిమాకు థియేటర్స్ విషయంలో కావాలనే అలా చేసుకున్నారు అంటూ విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. అయితే థియేటర్లో సినిమాను ఆపవచ్చు కానీ ఓటిటి ప్లాటుఫారంలో అపలేరు కదా. ఈ సిరీస్ కూడా అంతే ట్రైలర్ లోనే జగన్ మీద పంచులున్నాయంటే ఇక సిరీస్ లో ఇతర మంత్రులు వారి మీద ఎలాంటి పంచులు ఉంటాయో చూడాలి అంటూ చెప్పారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…